Rahu transit 2023: కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందోనని అందరిలోనూ ఉత్సుకత ఉంటుంది. ఆస్ట్రాలజీలో రాహు గ్రహాన్ని ఛాయాగ్రహాంగా భావిస్తారు. ఇతడు ఎల్లప్పుడూ రివర్స్ డైరెక్షన్‌లోనే కదులుతాడు. శని తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం రాహు. ఇది ఏడాదిన్నరకొకసారి తన రాశిచక్రాన్ని మారుస్తుంది. 2023 సంవత్సరంలో రాహువు అక్టోబర్ వరకు మేషరాశిలో ఉంటాడు, ఈ రాశికి అధిపతి కుజుడు. ఆ తర్వాత రాహు బృహస్పతి రాశి అయిన మీన రాశిలోకి వెళ్లనున్నాడు. కొత్త సంవత్సరంలో రాహువు వల్ల ఏయే రాశులు ఎక్కువగా ఇబ్బంది పడతారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): రాహువు మేషరాశి వారి తెలివితేటలను ప్రభావితం చేస్తాడు. దీంతో వీరు గందరగోళానికి గురవుతారు. అంతేకాకుండా పనిలో తొందరపాటు వల్ల సమస్యలు తలెత్తుతాయి. మీరు ఏదైనా కుట్రలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఇతరులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. 
వృషభం (Taurus): రాహు గ్రహం మీకు శారీరక బాధను కలిగిస్తుంది. మీరు ఆస్పత్రికి వెళతారు. పనికిరాని పనులకు డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో మీరు మానసికంగా కలవరపడవచ్చు. మీరు వెంటనే విజయాలను సాధించలేరు. 
తుల (Libra): ఈ సమయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీ సహద్యోగులతో వాగ్వాదం రావచ్చు. మీ వ్యాపార భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు నష్టాలను చవిచూస్తారు. 
మకరం (Capricorn): వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. మీ మధ్య సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుంది. ప్రశాంతంగా మరియు ఓపికగ్గా పని చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచించి తీసుకోండి. కుటుంబం వాతావరణం బాగుండదు. మీ జీవితంలో ఎత్తుపల్లాలు చూసే అవకాశం ఉంది. 
మీనం (Pisces): మీరు డబ్బు వెంట పడుతున్న కొద్దీ కుటుంబానికి దూరమయ్యే అవకాశం ఉంది. పుడ్ మీద శ్రద్ద పెట్టండి, లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు చాలా కష్టంగా ఉంటుంది. 


ఈ పరిహారాలు చేయండి..
రాహు చెడు దోషాలను నివారించడానికి రాహు మంత్రాన్ని జపించండి. బుధవారం నాడు ఏడు రకాల ధాన్యాలు, గాజు వస్తువులు, బార్లీ, ఆవాలు, నాణెం, నీలం లేదా గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయండి. రాహువు దోషం ఉన్నట్లయితే గోమేధిక రాయిని ధరించండి. రోగాలు రాకుండా ఉండాలంటే రాహు యంత్రాన్ని పూజించండి. నల్ల కుక్కకు రొట్టె తినిపించండి.


Also Read: Budh Uday 2023: బుధుడి ఉదయం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook