Rahu Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం రాహువుని మాయాగ్రహంగా భావిస్తారు. సాధారణంగా రాహు, కేతు గ్రహాల పేర్లు వినగానే చాలామందికి ఓ విధమైన భయం పుడుతుంటుంది. ఈ రెండు గ్రహాల వక్రమార్గం కారణంగా ప్రతికూల ప్రభావమే ఎక్కువగా కన్పిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం రాహు, కేతు గ్రహాలు ఎప్పుడూ వక్రమార్గంలోనే పయనిస్తుండటం వల్ల నెగెటివ్ ప్రభావం పడుతుందనే భావన ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. కొన్ని సందర్భాల్లో రాహువు శుభప్రదంగా కూడా ఉంటుంది. రాహువు రాశి పరివర్తనం ప్రభావం 3 రాశులకు అపారమైన ధనవర్షం కురిపించనుంది. విజయం సిద్ధించనుంది. కుండలిలో రాహువు ఉన్నత స్థితిలో ఉండటం వవల్ల అంతులేని ప్రజాదరణ, ఉన్నత పదవులు, డబ్బులు లభిస్తాయి. రాహు, కేతు గ్రహాల రాశి పరివర్తనానికి రెండున్నరేళ్లు పడుతుంటుంది. అక్టోబర్ 30వ తేదీన రాహువు గోచారం చేయనున్నాడు. రాహువు మేషరాశి నుంచి బయటికొచ్చి మీనరాశిలో ప్రవేశించనుండటం వల్ల ఆ ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా పడుతుంది. మూడు రాశులకు మాత్రం ఊహించని డబ్బును ఆర్జించి పెడుతుంది. 


మకర రాశి


జ్యోతిష్యం ప్రకారం రాహువు రాశి పరివర్తనంతో మకర రాశి జాతకులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఈ సమయంలో ఈ రాశి జాతకుల వీరోచితత్వం పెరుగుతుంది. ప్రత్యర్ధులపై విజయం సాధిస్తారు. విదేశాలకు సంబంధించిన పనులతో ధనలాభం కలుగుతుంది. సోదర సోదరీమణుల సహకారం లాభిస్తుంది. ఆస్థుల కొనుగోలు ఉంటుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా మెరుగుపడుతుంది. ఆర్ధికంగా సమస్యలు ఉండవు.


వృశ్చిక రాశి


రాహువు గోచారం వృశ్చిక రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఏదైనా రంగంలో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. షేర్ మార్కెట్, మార్కెట్, లాటరీ, జూదం రంగాల్లో ఊహించని లాభాలు కన్పిస్తాయి. వ్యాపారం విస్తరించి లాభాలు ఆర్జిస్తారు. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్ధికంగా ఎలాంటి సమస్యలుండవు. ఆరోగ్యం బాగుంటుంది.


కుంభ రాశి


ఈ సమయంలో శని కుంభరాశిలో ఉండటంతో మార్చ్ 2025 వరకూ అంటే మరో రెండేళ్ల పాటు ఊహించని లాభాలు కలుగుతాయి. ఊహించని మార్గాల్లో ధనలాభం కలగడం వల్ల ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్థులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 


Also read: Saturn Retrograde 2023: శనిగ్రహం వక్రమార్గంతో ఆ 3 రాశులకు ఊహించని వరాలు, కనకవర్షం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook