Rahu Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. 2023 సంవత్సరంలో రాహువు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది మొత్తం 12 రాశులవారి జీవితాలపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. అక్టోబరు 30వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు రాహువు అంగారకుడిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మీనంలో రాహువు సంచారం (Rahu Gochar 2023) వల్ల ఏ రాశులవారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహు మీన సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషం (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీనంలో రాహు సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరికి ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది.  


కర్కాటకం (Cancer)- కొత్త సంవత్సరంలో రాహువు ప్రవేశం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఓర్పు, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. రాహు సంచార కాలంలో నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. 


మీనం (Pisces)- 2023 అక్టోబర్‌లో రాహువు మేషరాశి నుండి బయటకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశివారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా పురోగమిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్తలు వింటారు. 


Also Read: Surya Gochar 2022: వృశ్చికరాశిలోకి ఆదిత్యుడు.. ఈ 3 రాశుల అదృష్టం ప్రకాశించడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook