Rahu Transit 2024 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. అందులో రాహు గ్రహం కూడా ఒకటి. ఈ గ్రహం కదలికలు చేయడం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం రాహువు గ్రహం మీన రాశిలో సంచార క్రమంలో ఉంది. ఈ గ్రహం వచ్చే ఏడాది కుంభ రాశిలోకి సంచారం చేయనుంది. తెలుగు పంచాగం ప్రకారం, ఈ రాహువు గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి జూలై 8వ తేదిన పూర్వ భాద్రపద నక్షత్రంలో  సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
రాహువు సంచార ప్రభావం మేష రాశివారిపై ప్రత్యేకంగా పడుతుంది. దీని కారణంగా వీరికి అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆగిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా జరిగిపోతాయి. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన పనుల్లో కూడా ప్రమోషన్స్‌ లభిస్తాయి. అలాగే ముఖ్యమైన కొన్ని పనుల్లో కూడా విజయం సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా కష్టపడి పని చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విదేశాలకు వెళ్లి పనులు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంలో పాటు పిల్లలపై ఉన్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. 


కన్య రాశి:
కన్యా రాశివారికి కూడా ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారికి 7వ స్థానంలో ఈ సంచారం జరిగింది. కాబట్టి వీరికి వ్యాపార పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశీ ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఇబ్బందుల నుంచి కూడా పూర్తిగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రాహువు సంచారం కారణంగా వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


కుంభ రాశి:
కుంభ రాశివారికి కూడా రాహువు సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక పరిస్థితులు మరిపోయి.. అన్ని ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. దీంతో పాటు ఊహించని డబ్బులు కూడా తిరిగి వస్తాయి. అలాగే కొత్త పనులు ప్రారంభించడం వల్ల కూడా ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి