Rahu Gochar 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, శని తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు. ఇతడిని ఛాయా లేదా దుష్ట గ్రహం అని పిలుస్తారు. ఒక్కో రాశిలో రాహువు సంవత్సరంపాటు ఉంటాడు. ప్రస్తుతం రాహువు మేషరాశిలో  సంచరిస్తున్నాడు. అక్టోబర్ 30న 2.13 నిమిషాల వరకు అదే రాశిలో ఉండనున్నాడు. అనంతరం రాహువు మీనరాశికి వెళ్తారు. జాతకంలో రాహువు స్థానం అశుభంగా ఉన్నట్లయితే.. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మేషరాశిలో రాహు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడతారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
ఈ రాశికి 10వ ఇంట్లో రాహువు కూర్చున్నాడు. ఉద్యోగులు ఈ సమయంలో ప్రయోజనం పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. శివలింగంపై జలాభిషేకం చేయడం వల్ల రాహు చెడు ప్రభావాలు తొలగిపోతాయి. 


కర్కాటక రాశి
రాహు సంచారం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. కుక్కకు పాలు, రొట్టె తినిపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Benefits of Shash Rajyog: శష్ రాజయోగంతో ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్... ఇందులో మీ రాశి ఉందా?


కుంభ రాశి
మీ జాతకంలో రాహువు మూడో ఇంట్లో కూర్చున్నాడు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులు లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. ఆదాయం డబల్ అవుతుంది. 


వృశ్చిక రాశి
రాహువు వృశ్చిక రాశి యెుక్క ఆరవ ఇంటికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో ఈ రాశి వారికి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ దక్కుతుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. అయితే ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి.


Also Read: Budh Asta 2023: వృషభరాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 3 రాశుల వారు పేదవారిగా మారడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook