Rahu Transit 2024: గ్రహాల గోచారంలో భాగంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. వచ్చే ఏడాది అంటే 2024 మార్చ్ 7వ తేదీన రాహువు మీన రాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న బుధుడి కారణంగా రాహు-బుధ యుతి ఏర్పడనుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి అమితమైన ప్రాధాన్యత ఉంది. అందుకే గ్రహాల గోచారం ఏయే రాశిపై ఎలా ఉంటుందోననే ఆసక్తి ఉంటుంది. ప్రతి నెలా ఉన్నట్టు వివిధ గ్రహాలు నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటాయి. మార్చ్ 7వ తేదీన రాహువు మీన రాశిలో ప్రవేశించి దాదాపు 18 నెలలు అదే రాశిలో ఉంటాడు. దీనివల్ల ఏర్పడే బుధ, రాహువుల యుతితో కొన్ని రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే. అది కూడా ఏడాదిన్నరపాటు తిరుగుండదు. జ్యోతిష్యం ప్రకారం రాహువు భౌతిక సుఖాలనిస్తాడు. రాహువు కటాక్షం ఉందంటే ఆ వ్యక్తికి జీవితంలో అత్యంత ప్రజాకర్షణ లభిస్తుందంటారు. వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయి. రాహువు ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు 18 నెలల సమయం పడుతుంది. అంటే ఈ 18 నెలలు ఆయా రాశి గోచారం బట్టి ఆ వ్యక్తికి కష్టాలు లేదా సుఖాలుంటాయి.


తులా రాశి జాతకులకు బుధుడు, రాహువు కలయికతో ఏర్పడే యుతి కారణంగా అత్యంత ప్రయోజనం లభించనుంది. ఈ రాశి జాతకులకు అన్నీ అనుకూలిస్తాయి. దాదాపు ఏడాదిన్నర వరకూ గోల్డెన్ డేస్ నడుస్తాయి. కోర్టు పరమైన అంశాల్లో అనుకూలంగా నిర్ణయం రావచ్చు. కుటుంబ సభ్యులతో బంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య దృష్ట్యా, ఆర్ధికంగా 2024 ఈ రాశి వారికి చాలా మంచిది. చాలా సమస్యల్నించి విముక్తి లభిస్తుంది. 


బుధ, రాహు గ్రహాల యుతితో కుంభ రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు 18 నెలల వరకూ ఈ రాశి జాతకులు వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. అంతా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఆర్ధిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులుండవు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు లేదా పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆకశ్మిక ధనయోగం ఉంటుందంటున్నారు. రానున్న ఏడాదిలో అంతా సానుకూలంగా ఉంటుంది. అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది.


వృషభ రాశి జాతకులకు బుధ, రాహు గ్రహాల యుతి, మీన రాశి ప్రవేశం వల్ల ఆర్ధికంగా బలం చేకూరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల్ని ఇస్తాయి. 2024 ఏడాది అంతా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం సానుకూల ఫలితాలనిస్తుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఎగుమతి, దిగుమతి చేసే వ్యాపారులకు మంచి లాభాలు ఆర్జించే సమయంగా పరిగణిస్తారు. షేర్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. 


Also read: Telangana: రేషన్ కార్డుల జారీలో ఆదాయ ధృవీకరణకు మినహాయింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook