Rahu Transit 2022: రాహు, శని గ్రహాల బలమైన యోగం... ఈ రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభాలు..
Rahu Transit 2022: మకరరాశిలో శని తిరోగమం మేషరాశిలోనూ రాహువును శక్తివంతం చేస్తుంది. తద్వారా బలమైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Rahu Gochar 2022 Effects: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రస్తుతం రాహు గ్రహం మేషరాశిలో సంచరిస్తోంది. మేషరాశిని కుజుడు పాలిస్తాడు. ఇదే సమయంలో శని తన సొంత రాశి అయిన మకరరాశిలో తిరోగమనంలో ఉంటాడు. మకరరాశిలో శని సంచార ప్రభావం మేషరాశిపై పడి రాహువుని శక్తివంతం చేస్తుంది. శని గ్రహం కారణంగా రాహువు బలపడటం అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ.. ఇది ముఖ్యంగా 4 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మేష, కర్కాటక, తుల, మకర రాశుల వారికి శని, రాహువు సంచారం వల్ల లాభిస్తుంది. ఈ రాశులవారి పురోగతికి దారులు తెరుచుకోనున్నాయి.
మేషరాశి (Aries): మేష రాశి వారికి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ రావచ్చు. పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి(Cancer): కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు ప్రమోషన్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు.
తులారాశి (Libra): తుల రాశి వారికి పరాక్రమం, ధైర్యం పెరుగుతాయి. అయితే వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఆదాయం పెరగవచ్చు.
మకరరాశి (Capricorn): మకర రాశి వారికి ఈ సమయంలో ఆస్తి కలిసి వస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త జాబ్ రావచ్చు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
Also Read: సూర్య, రాహు షడష్టక యోగం... సెప్టెంబర్ 17 నుంచి ఈ 5 రాశులవారు బీ అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook