Raksha Bandhan 2024: రాఖీపై అపోహాలు వద్దు.. రాఖీ ఎప్పుడో కట్టాలో చెప్పిన పండితులు
Raksha Bandhan 2024 What Is Shubh Muhuratam For Rakhi Tie: సోషల్ మీడియాలో రాఖీ పండుగపై వస్తున్న అపోహాలపై పండితులు స్పష్టమైన ప్రకటన చేశారు. ఎప్పుడు రాఖీలు కట్టాలనే విషయాన్ని తెలిపారు.
Raksha Bandhan 2024: శ్రావణమాసంలో వచ్చే అతిపెద్ద పండుగ రాఖీ. అయితే ఈ పండుగ రోజు రాఖీ ఎప్పుడు కట్టాలనే విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ రాగా ఎప్పుడు రాఖీ కట్టాలనే విషయంలో గందరగోళం నెలకొంది. ముహూర్తం ఎప్పుడు ఉంది.. ఏ సమయానికి రాఖీ కట్టాలనే అనే గందరగోళానికి పండితులు తెరదించారు. రాఖీ పండుగ రోజు ఎప్పుడు తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టాలనే విషయంపై స్పష్టత ఇచ్చారు.
Also Read: Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్, దుకాణాలు అన్నీ మూత?
రాఖీ కట్టడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయాన్నే కట్టాలి.. ఈ సమయంలో రాఖీ కట్టొద్దని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటన్నింటిని మంచిర్యాల జిల్లాకు చెందిన వేద పండితులు మల్లోజ్జల రవి శర్మ ఖండించారు. రాఖీ కట్టడానికి ఎలాంటి ముహూర్తం లేదని స్పష్టం చేశారు. ఏ సమయంలోనైనా రాఖీ కట్టవచ్చని తేల్చి చెప్పారు.
Also Read: Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం
రాఖీ పండగ రోజు ఏ నియమాలు లేవు.. సమయాలు కూడా లేవుని మల్లోజ్జల రవి శర్మ తెలిపారు. ఎప్పటిలాగానే ఉదయం సోదరులు తమ అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టుకోవచ్చని పేర్కొన్నారు. స్వస్తిశ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం పౌర్ణమి తిథి తేదీ 19 824 సోమవారం రోజున రాఖీ పౌర్ణమి వచ్చిందని వివరించారు. మధ్యాహ్నం 1:36 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసుకోవాలని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం తప్పని తెలిపారు. అవన్నీ అపోహలని.. వాటిని నమ్మవద్దని సూచించారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా పుణ్యస్నానాలు ఆచరించి.. పూజా కార్యక్రమాల అనంతరం రాఖీలు కట్టుకోవచ్చని వెల్లడించారు. రాఖీ పండుగపై ఎలాంటి అపోహాలను నమ్మకుండా కుటుంబంతో సంతోషంగా చేసుకోవాలని తెలిపారు. రాఖీ పండుగతో అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ల అనుబంధం మరింత పెరగాలని అభిలషించారు. ఈ సందర్భంగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
దుకాణాలు కళకళ
రాఖీ పండుగపై అర్చకులు స్పష్టమైన ప్రకటన చేయడంతో గందరగోళం తొలగిపోయింది. రాఖీ పండుగ యథావిధిగా ఉదయం తమ సోదరులకు మహిళలు రాఖీలు కట్టవచ్చు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలు రాఖీలు కొనేందుకు బారులు తీరారు. తీరొక్క రీతిలో ఉన్న రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో సందడి ఏర్పడింది. రాఖీ దుకాణాలు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. అంతేకాకుండా మిఠాయి దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి. రాఖీ కట్టిన అనంతరం మహిళలు తమ సోదరులకు తినిపించేందుకు స్వీట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక రాఖీలు కట్టిన తమ సోదరిమణులకు బహుమతులు ఇచ్చేందుకు అన్నదమ్ముళ్లు గిఫ్ట్స్ షాపుల్లో సందడి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter