Rakshabandhan 2022: హిందూమతం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శని అంటే చాలామంది భయపడుతుంటారు. శనితో పాటు చెల్లెలు భద్ర అంటే కూడా ఇదే భయముంటుంది. మరి ఈసారి రక్షాబంధన్‌పై భద్ర ప్రభావం వల్ల ఏమౌతుందనేది ఆసక్తిగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో రక్షాబంధన్ అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. అయితే ఈ ఏడాది రక్షాబంధన్ పండుగపై కొంత ఆందోళన నెలకొంది. కారణం రక్షాబంధన్‌పై శని చెల్లెలు భద్ర నీడ ఉండటమే. భద్ర సమయం అనేది హిందూ ధర్మం ప్రకారం అశుభంగా భావిస్తారు. భద్రకాలంలో రాఖీ కట్టడం కానీ..పూజలు చేయడం కానీ, కొత్త పనులు చేపట్టడం, గృహ ప్రవేశాలు, ముండనం వంటి ఏ పనీ చేపట్టరు. భద్రకాలంలో శుభకార్యాలు చేపడితే ప్రతికూల ప్రభావం చూపిస్తాయంటారు. అందుకే భద్రకాలం నుంచి బయటపడటమే అత్యుత్తమ మార్గమని జ్యోతిష్యులు చెబుతున్నారు.


శని లానే చెల్లెలు భద్ర కూడా ప్రమాదకరం


సూర్యుదేవుడు, ఛాయల కుమార్తె భద్ర. శనిదేవుడి సొంత చెల్లెలు. శని ఏవిధంగా కఠినంగా, కోపిష్టిగా ఉంటాడో అదే విధంగా చెల్లెలు భద్ర కూడా ఆ స్వభావాన్నే కలిగి ఉంటుంది. పురాణాల ప్రకారం..భద్ర అత్యంత కురూపిగా చెబుతారు. బాల్యం నుంచే రుషులు, మునుల యజ్ఞాదికార్యక్రమాల్లో ఆటంకం కల్గించేది. సూర్యుడు దీనిపై ఆందోళన చెంది బ్రహ్మను సలహా అడుగుతాడు. దాంతో భద్రను నియంత్రించేందుకు పంచాంగం నిర్ణీత సమయానికి పరిమితం చేస్తాడు. అప్పటి నుంచి ఆ సమయంలో ఎవరైనా శుభకార్యాలు చేస్తుంటే విఘ్నం కల్గిస్తూ ఉంటుంది. 


గృహ ప్రవేశాలు, కొత్త పనులు ప్రారంభం, పూజాది కార్యక్రమాలు, ముండనం వంటివే కాకుండా భద్రకాలంలో రాఖీ కూడా కట్టరు. వాస్తవానికి రావణుడి చెల్లెలు రావణుడికి భద్రకాలంలోనే రాఖీ కడుతుంది. అదే ఏడాదిలో రాముడు..రావణ సంహారం చేస్తాడు. అందుకే భద్రకాలంలో రాఖీ కట్టడం కూడా మంచిది కాదు. ఈ ఏడాది ఆగస్టు11వ తేదీన రక్షాబంధన్ ..భద్రకాలంలో వస్తోంది. అందుకే చాలామంది ఆగస్టు 12 ఉదయం రక్షాబంధన్ జరుపుకుంటారు.


Also read: Ganesh Puja: బుధవారం సిద్ధి వినాయకుడిని ఇలా పూజించండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook