Ramadan Fasting Times: ఇస్లాంలో రంజాన్ నెలకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముంది. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ఇస్లామిక్ కేలండర్‌లో రంజాన్ అనేది 9వ నెల. ఈ నెలలోనే ముస్లింలు ఉపవాసాలు ఎందుకుంటారు, ఆ ప్రత్యేకత ఏంటనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. త్రికరణ శుద్ధితో, స్వచ్ఛమైన మనస్సుతో 30 రోజులు ఉపవాసాలు కచ్చితంగా ఆచరిస్తారు. ఎందుకంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంజాన్‌లోనే ఉపవాసాలు ఎందుకు


ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవతరించింది రంజాన్ నెలలోనే. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంధాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెలరోజులు విధిగా ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకూ ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ సమయంలో పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా నిష్టగా ఉంటారు. ఆశలకు, కోర్కెలకు కళ్లెం వేస్తారు. ఆత్మను పరిశుభ్రం చేసుకుంటారు. మంచి పనులు, దానాలతో పుణ్యం సంపాదించుకునేందుకు పోటీ పడతారని చెప్పవచ్చు. రంజాన్ నెలలో ఓ వైపు ఉపవాసాలు, మరోవైపు ఖురాన్ పఠనంతో మనస్సు, శరీరం, ఆత్మ అన్నీ పరిశుద్ధమౌతాయి. అల్లాహ్‌కు మరింత చేరువయ్యేందుకు రంజాన్ అత్యుత్తమ మార్గమని నమ్ముతారు. 


ఉపవాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి


ఇస్లాంలో ఉపవాసాలు రెండవ శకంలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీని గురించి ఖురాన్‌లోని రెండవ సూరా అల్ బఖ్రాలో ప్రస్తావన ఉంది. మీ కంటే ముందు తరంపై ఉపవాసాలు ఎలా విధిగా అమలు చేయబడినవో అదే విధంగా మీపై విధిగావించబడిందని సూరహ్ అల్ బఖ్రాలో ఉంది. మొహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన ఏడాది తరువాత ముస్లింలపై ఈ ఉపవాసాలు విధిగావించబడ్డాయి. 


సూర్యోదయానికి ముందు సహరీతో ప్రారంభించి సూర్యాస్తమయం వేళ ఇఫ్తార్‌తో ముగించేది ఉపవాసం. నిత్యం ఆచరించే ఐదు పూట్ల నమాజుతో పాటు రాత్రి వేళ తరావీ నమాజ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నమాజ్ ద్వారా 30 రోజులు ఖురాన్ పఠనం ఉంటుంది. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం నెలకు 29 లేదా 30 రోజులుంటాయి. ఇస్లామిక్ కేలండర్ చంద్రమానం ప్రకారం ఉంటుంది. షాబాన్ నెల 29వ రోజు చంద్రదర్శనమైతే 30వ రేజు నుంచి రంజాన్ ప్రారంభమౌతుంది. చంద్ర దర్శనం కాకుంటే షాబాన్ 30 రోజులు పూర్తయ్యాక రంజాన్ ఉపవాసాలు ప్రారంభిస్తారు. అదే విధంగా రంజాన్ నెల 29వ రోజు చంద్రదర్శనంతో ఉపవాసాల దీక్ష ముగించి 30వ రోజు ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటారు. చంద్రదర్శనం కాకుంటే 30 రోజుల రంజాన్ ఉపవాసాలు పూర్తి చేసి మరుసటి రోజు ఈదుల్ ఫిత్ర్ పండుగ చేసుకుంటారు. 


Also read: Supreme Court on SBI: ఎస్పీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రేపటిలోగా వివరాలు ఇవ్వాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter