Zakat Calculation: ప్రపంచంలోని ముస్లింలు అంతా రంజాన్ ఉపవాసాల్లో మునిగి ఉన్నారు. భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఆచరిస్తూ ఐదు పూట్ల నమాజు చేయడమే కాకుండా పవిత్ర ఖురాన్ పఠనంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అదే సమయంలో  తప్పకుండా పాటించాల్సిన కొన్ని ఇస్లామిక్ నియమాలున్నాయి. అందులో ముఖ్యమైంది జకాత్. అంటే ఓ విధంగా చెప్పాలంటే ముస్లింలు చెల్లించే థార్మిక ట్యాక్స్. జకాత్ అంటే ఏమిటి, ఎంత చెల్లించాలి, ఎవరికి చెల్లించాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల కావడంతోనే రంజాన్‌కు అత్యంత ప్రాధాన్యత, మహత్యం. ఇస్లామిక్ కేలండర్‌తో మొహర్రంతో ప్రారంభమౌతుంది. జిలి హజ్ అనేది చివరి నెల. ఈ నెలలోనే బక్రీద్ పండుగ జరుపుకుంటారు. సాధారణంగా ఇన్‌కంటాక్స్ గురించి అందరికీ తెలిసిందే. నిర్ణీత ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి స్లాబ్‌ను బట్టి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రజలు చెల్లించే ఈ ట్యాక్స్‌తోనే ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటుంది. అదే విధంగా అర్హత కలిగిన ప్రతి ముస్లిం తప్పకుండా విధిగా చెల్లించాల్సిన ట్యాక్స్‌నే జకాత్ అంటారు. ఇది ప్రభుత్వానికి కాదు చెల్లించాల్సింది. పేదలకు చెల్లించాలి. 


జకాత్ ఎంత చెల్లించాలి, ఎవరు తీయాలి


ప్రతి యేటా రంజాన్ నెలలో జకాత్ అంటే ఇస్లామిక్ ట్యాక్స్ తీయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉండే బంగారం, వెండి నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే మొత్తం విలువపై 2.5 శాతం జకాత్ తీయాలి. ఇంట్లో 85 గ్రామలకు మించి బంగారం ఉన్నా, 595 గ్రాములకు మించి వెండి ఉన్నా కొన్నప్పటి విలువ కాకుండా మార్కెట్ రేటు ఆధారంగా లెక్కగట్టి అందులో 2.5 శాతం డబ్బులు తీయాలి. బ్యాంక్ బ్యాలెన్స్ లేదా ఇంట్లో ఉండే డబ్బులపై కూడా 2.5 శాతం జకాత్ తీయాలి. ఇదెలాగంటే..595 గ్రాముల వెండి మార్కెట్ విలువని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడున్న వెండి ధరల ప్రకారం లెక్కగడితే 595 గ్రాముల వెండి విలువ 47,897 రూపాయలు అవుతుంది. ఇంతకంటే ఎక్కువ డబ్బులు మీ వద్ద ఏడాది దాటి ఉంటే మొత్తం డబ్బులపై 2.5 శాతం ట్యాక్స్ లేదా జకాత్ చెల్లించాలి.  అదే విధంగా పీఎఫ్ డబ్బులపై కూడా వడ్డీ మినహాయించి మీరు ఆదా చేసిన డబ్బులు వెండి విలువను దాటి ఏడాదిగా ఉంటే వాటిపై కూడా 2.5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. స్థూలంగా చెప్పాలంటే మీకు సంబంధించిన డబ్బు ఎక్కడ ఎలా ఉన్నా...దానిపై జకాత్ తీయాల్సిందే. అదే సమయంలో వ్యవసాయ ఆదాయంపై కూడా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది. వర్షాధార వ్యవసాయ పంటలపై అయితే 10 శాతం, సహజసిద్ధ నీటి వనరులుంటే మాత్రం 20 శాతం జకాత్ తీయాల్సి ఉంటుంది. 


జకాత్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు


జకాత్ అనేది మన పిల్లలకు, తల్లిదండ్రులకు ఇవ్వకూడదు. ఎందుకంటే వారి బాద్యత మనదే అవుతుంది కాబట్టి. జకాత్ అనేది పేదలు, అనాధలు, విధివశాత్తూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండేవారికి చెల్లించాలి. ముందుగా మన బంధువుల్లో సోదర, సోదరీమణులు ఇతర బంధుత్వాల్లో ఉంటేవారికి చెల్లించాలి. పేదలు, అనాథలు, రుణగ్రస్థులకు చెల్లిస్తే చాలా మంచిది. 


జకాత్‌ను పూర్తిగా నగదు రూపంలోనే అర్హులైనవారికి ఇవ్వాలి. వస్తురూపంలో ఇవ్వకూడదు. ఎగువ పేర్కొన్న ప్రమాణాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా రంజాన్ నెలలో జకాత్ తీసి పేదలకు చెల్లించాల్సిందే. జకాత్ తీయగలిగిన అర్హత ఉండి చెల్లించకపోతే మహా పాపం. 


Also read: Ramadan 2024: రేపట్నించి రంజాన్ ప్రారంభం, ఈ నెలలోనే ఉపవాసాలెందుకుంటారు, ఎప్పుడు మొదలైంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook