Rangbhari Ekadashi 2023 Date: ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని 'అమలకి ఏకాదశి' లేదా 'రంగభరి ఏకాదశి' అని పిలుస్తారు. ఈ ఏడాది మార్చి 3న ఈ పండుగ జరుపుకుంతున్నారు. ఇక రంగభరి ఏకాదశి రోజున విష్ణువును పూజించడంతో పాటు ఉసిరి చెట్టును కూడా పూజించాలనే నియమం ఉంది. ఏకాదశి తిథి విష్ణుప్రియమైనది, అంతేకాకుండా అదే రోజున పరమశివుడు తన ప్రియమైన కాశీ నగరానికి తల్లి పార్వతితో వివాహం తర్వాత మొదటిసారిగా రాగా అక్కడ దేవతలందరూ శివ-పార్వతులను పూజించారని అంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రంగభరి ఏకాదశి ఉదయం ఉపవాస తీర్మానం చేసి, పరమ భక్తితో పరశురాముని విగ్రహాన్ని లేదా ఫోటోని పూజించాలి. అదే సమయంలో ఉసిరి చెట్టుని పూజించి, 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ, వీలైనంత వరకు ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. సమీపంలో ఏ చెట్టు అందుబాటులో లేకుంటే, ఉసిరి ఫలాన్ని విష్ణువుకు ప్రసాదంగా సమర్పించి, నెయ్యి దీపం లేదా కర్పూరంతో హారతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు వీలైనంత వరకు చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. 


రంగభరి ఏకాదశి ఏకాదశి ఎన్నో యాగాలు చేయడం కంటే ఎక్కువ ఫలితాలను ఇస్తుందట.  ఈ విషయాన్ని మహావిష్ణువు పురాణాలలో చెప్పాడు, స్వర్గం, మోక్షాన్ని పొందాలనుకునే వారికి, అమలకీ ఏకాదశి వ్రతం ఉత్తమం. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాక అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున ఉసిరి మొక్కను నాటడం వలన జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి.


అందుకే సర్వ పాపాలు నశింపజేసే అత్యంత పూజనీయమైన చెట్టుగా ఉసిరిని చెబుతూ ఉంటారు. ఇక పద్మ పురాణం ప్రకారం, విష్ణువు ఉమ్మి వేసినప్పుడు, అతని నోటి నుండి చంద్రుని వంటి తేజస్సు ఉన్న చుక్క భూమిపై పడింది, దాని నుండి అమలకి (ఉసిరి) అనే ఒక గొప్ప దివ్య వృక్షం జన్మించింది, దీనిని అన్ని చెట్లకు మూలకర్త అని చెబుతారు. 


ఇక అమలకి ఏకాదశి తిథి మర్చి ఉదయం 6:39కి ప్రారంభమై, మార్చి 3 ఉదయం 9:01 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, అమలకి ఏకాదశి మార్చి 3, 2023న జరుపుకుంటారు.


Also Read: Three Rajyog effect: 617 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక.. ఈ రాశుల దశ తిరగడం పక్కా..


Also Read: Importance of Holi: హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. కాముని పున్నమి అని ఎందుకు అంటారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి