Rasi Phalalu 2023: నవంబర్ 6న బుధుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారు పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. బుధుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏయే రాశులవారి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
వృశ్చికరాశిలోకి బుధుడు సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరిగి కొన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. అయితే కొన్ని విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.


వృషభ రాశి:
వృషభ రాశి వారు ఈ సమయంలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు మనస్సు కలత చెందడమే కాకుండా ఏదో తెలియని భయంతో ఇబ్బందులు పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరికి కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ రాశివారు కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ సమయం మనసు చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా అనేక విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది. ఆదాయం పెరిగి వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడతారు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మనసులో శాంతి, సంతోషం పెరుగుతుంది. దీని కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా పురోగతి లభించి, జీతాలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు అధికారుల మద్దతు లభించి విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


సింహరాశి:
ఈ సమయం సింహ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మనస్సు ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా శుభవార్తాలు వింటారు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook