Astrological Prediction 2024: మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. జనవరి నెలలో కొన్ని గ్రహాల స్థానం అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, కుజుడు మరియు శుక్రడు గమనంలో పెను మార్పులు రాబోతున్నాయి. కెరీర్, వ్యాపారం మరియు ఉద్యోగం పరంగా 2024 సంవత్సరం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. న్యూ ఇయర్ లో ధనుస్సు, కర్కాటకం మరియు సింహ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి 
కొత్త సంవత్సరం కర్కాటక రాశి వారికి కూడా శుభ ఫలితాలనిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. 
సింహరాశి
2024లో సింహరాశి వారిపై లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపించనుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక 2024లో ఫలిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. మీ శాలరీ భారీగా పెరుగుతుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: Surya Gochar 2024: జనవరి 15న మకరంలోకి సూర్యుడు.. ఈ 2 రాశులకు లాభాలు బోలెడు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook