Rasi Phalalu 2024 To 2025 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒకే రాశిలో రెండు గ్రహాలు కలవడం కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న కొన్ని శక్తివంతమైన గ్రహాలు కలవడం కారణంగా శుభప్రదమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ చివరి వారం లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుజ గ్రహం సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం బుధవారం ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే ధనస్సు రాశిలో సూర్యుడు సంచార దశలో ఉన్నాడు. కాబట్టి ఈ రెండు గ్రహాలు ఈరోజు కలవబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా ఓ ప్రత్యేకమైన శక్తి ఏర్పడబోతోంది.


కుజ గ్రహం ధనస్సు రాశిలో ఉన్న సూర్య గ్రహంతో కలవడం కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగ ప్రభావం అన్ని రాశుల వారిపై సమానంగా పడుతుంది. ముఖ్యంగా కుజుడు జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి ఈ రాజయోగ ప్రభావం ప్రత్యక్షంగా పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు.


సింహరాశి:
ఈరోజు ఏర్పడిన ఆదిత్య మంగళ రాజయోగం కారణంగా సింహ రాశి వారికి మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు పెరగడమే కాదు జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఆదాయంతో పాటు ఊహించని ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి.


తులారాశి:
ఈ ప్రత్యేక యోగ ప్రభావం తులారాశి వారిపై కూడా పడింది. దీని కారణంగా ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంతకుముందున్న అన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. దీంతోపాటు తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లభించి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


 ధనస్సు రాశి:
మంగళ ఆదిత్య రాజయోగ ప్రభావం ధనస్సు రాశి వారిపై కూడా పడింది. దీని కారణంగా ఉద్యోగంలో ఊహించని మార్పులు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రమోషన్స్ పొందడమే కాకుండా జీతాలు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా మీ తల్లి ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


మీన రాశి:
మంగళ ఆదిత్య రాజయోగం కారణంగా మీన రాశి వారి జీవితంలో కూడా అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ ప్రభావం మీన రాశి వారిపై సానుకూలంగా చూపబోతోంది. దీని కారణంగా వీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికి వస్తే ఈ సమయంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెడతారు. దీంతోపాటు ఈ సమయంలో కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉంటారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter