COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rasi Phalalu (28 Jan to 03 Feb 2024): ప్రతి నెల ఏదో ఒక గ్రహం రాశి సంచారం చేస్తూనే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక వారాల్లో మాత్రమే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి. ఇలా సంచారం చేయడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా ఈ వారం కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 03 వరకు ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.  


మేషరాశి:
మేష రాశివారికి ఈ వారం ఎంతో శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో  కొత్త పనుల పట్ల మక్కువ పెరుగుతుంది. దీంతో పాటు మానసిక ఆనందం కూడా లభించి సాధించాలనే లక్ష్యాలను సులభంగా సాధించగలుతారు. దీంతో పాటు ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వారం వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. దీని కారణంగా సంపాదన కూడా సులభంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఆస్తి సంబంధిత పనుల నుంచి ఊహించని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా కొత్త వాహనం లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. 


వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా లక్ష్యాలను సాధించేందుకు కూడా ఎంతో ఉత్సహంగా పనులు చేస్తారు. దీంతో పాటు నిలిచిపోయిన పనులు కూడా పరిష్కారమవుతాయి. అయితే ఈ సమయాల్లో కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. అంతేకాకుండా ఇతరులతో మాట్లాడే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు వృషభ రాశివారు ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. 


Also Read Tamarind Seeds: మంగు మచ్చలను తొలగించడం ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి!


మిథున రాశి:
ఫిబ్రవరి చివరి వారం మిథున రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో తీవ్ర నష్టాలు కూడా రావచ్చు. దీంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఖర్చులు పెరిగే ఛాన్స్‌ కూడా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నవారు ఈ వారం నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా తీవ్రంగా కూడా నష్టపోయే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సమయాల్లో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


కర్కాటక రాశి:
ఈ వారం కర్కాటక రాశివారు ఆలోచించి పనలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వేరేవారి విషయాల్లో ఎక్కువగా జ్యోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ వారం ఇతరులకు డబ్బులు అప్పుగా ఇవ్వొద్దు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాలు బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చి మానసిక సమస్యలకు దారి తీయోచ్చు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారికి కూడా సమయం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. 


సింహ రాశి:
ఈ వారం సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ ఆర్యోగ విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది..లేకపోతే తీవ్ర వ్యాధులు కూడా రావచ్చు.  అంతేకాకుండా ఈ వారం వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే ఛాన్స్‌ కూడా ఉంది. కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తులు కూడా లభిస్తాయి. సామాజిక రాజకీయ రంగాలలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. 


Also Read Tamarind Seeds: మంగు మచ్చలను తొలగించడం ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter