Mangal Vakri: వచ్చే 4 నెలలపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీరున్నారా మరి..
Retrograde Mars Transit: కుజ గ్రహం వచ్చే ఏడాది మార్చి 12, 2023 వరకు వృషభరాశిలో ఉంటాడు. వృషభరాశిలో అంగారకుడి సంచారం వల్ల ఏ రాశివారికి అశుభం జరగనుందో తెలుసుకుందాం.
Retrograde Mars Transit in Taurus: ఆస్ట్రాలజీలో మార్స్ గ్రహాన్ని క్రూర గ్రహం, రెడ్ ఫ్లానెట్ గా భావిస్తారు. రీసెంట్ గా అంటే నవంబరు 13న వృషభరాశిలో తిరోగమనం చేశాడు కుజుడు. వచ్చే ఏడాది మార్చి 12 వరకు అదే రాశిలో ఉంటాడు. అంగారకుడు తిరోగమన స్థితిలో రాశిని మార్చడం చాలా అరుదు. ఇంతకముందు 14 డిసెంబర్ 1975న ఇలా జరిగింది. దాదాపు 47 ఏళ్ల తర్వాత కుజుడు మరోసారి వృషభరాశిలోకి ప్రవేశించాడు. వృషభరాశిలో గురు వక్రీ కారణంగా కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
మేషరాశిపై తిరోగమన కుజుడి ప్రభావం
వృషభ రాశిలో తిరోగమన కుజుడు సంచరించడం వల్ల మేష రాశి వారు ((Retrograde Mars Transit Impact on aries) ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యులతో విడిపోయే పరిస్థితి రావచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం బాధాకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఈ ట్రాన్సిట్ అస్సలు అనుకూలం కాదు.
మిథునంపై తిరోగమన కుజుడి ప్రభావం
వృషభరాశిలో తిరోగమన అంగారకుని సంచారం మిథున రాశి వారి ఖర్చులను పెంచుతుంది (Retrograde Mars Transit Impact on Gemini). తమ్ముడు లేదా సోదరితో గొడవలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలించవు. పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి.
తులారాశిపై తిరోగమన కుజుడి ప్రభావం
వృషభరాశిలో తిరోగమన అంగారకుని సంచార సమయంలో ఈ రాశివారు (Retrograde Mars Transit Impact on Libra) విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఈ సమయంలో మానసకి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆఫీసులో మీకు సమయం అంతగా కలిసి రాదు.
మకరరాశిపై తిరోగమన కుజుడి ప్రభావం
వృషభరాశిలో తిరోగమన అంగారకుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోంటారు. పిల్లల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు. వ్యక్తిగత మిత్రులతో సంబంధాలు చెడిపోవచ్చు. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook