Rushi Panchami 2022 Date: భారతదేశంలోని ఋషులను గౌరవించటానికి కూడా ఓ పండుగ జరుపుకుంటారు. అదే రుషి పంచమి. ఈ ఋషి పంచమి వ్రతం (Rushi Panchami Vrat 2022) ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదో రోజున జరుపుకుంటారు. ఋషి పంచమినే రిషి పంచమి, గురు పంచమి అని కూడా అంటారు. సనాతన ధర్మంలో ఋషి పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏడుగురు ఋషులను పూజిస్తారు. ఈ రోజున ఎవరైతే ఋషులను పూజించి స్మరిస్తారో వారికి పాప విముక్తి లభిస్తుందని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ ముహూర్తం
బ్రహ్మ ముహూర్తం: సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 04:29 నుండి 05:14 వరకు
రవియోగం: సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 05:58 నుండి 12:12 వరకు
అభిజిత్ ముహూర్తం: 1 సెప్టెంబర్ ఉదయం 11:55 నుండి సాయంత్రం 12:46 వరకు
విజయ ముహూర్తం: సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 02:28 నుండి 03:19 వరకు 


వ్రత తేదీ
పంచమి తిథి ప్రారంభం : 31 ఆగస్టు 2022 మధ్యాహ్నం 03:22 గంటలకు
పంచమి తేదీ ముగింపు: 01 సెప్టెంబర్ 2022 మధ్యాహ్నం 02:49 గంటలకు
పూజ ముహూర్తం: 1 సెప్టెంబర్ 2022 ఉదయం 11: 05 నిమిషాల నుండి మధ్యాహ్నం 01: 37 నిమిషాల వరకు.
ఋషి పంచమి ఆరాధన వ్యవధి: 02 గంటల 33 నిమిషాలు 


వ్రత ప్రాముఖ్యత 
ఏడుగురు మహర్షుల ఆశీర్వాదంతో తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఋషి పంచమి రోజున మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. స్త్రీ రుతుక్రమం సమయంలో తప్పు చేస్తే, ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ దోషం తొలగిపోతుందని నమ్ముతారు. 


పూజ మంత్రం 
కాశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోత్ గౌతమా ।
జమదగ్నిర్వసిష్టశ్చ సప్తైతే ఋషయః స్మృతా॥
దహంతు పాపం సర్వ గృహ్ణాంతవర్ధ్యాం నమో నమః'


Also Read: Anant Chaturdashi 2022: అనంత చతుర్దశి ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook