Anant Chaturdashi 2022: అనంత చతుర్దశి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

Anant Chaturdashi 2022: భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి రోజున అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. దీంతో భగవంతుడు ప్రసన్నుడై భక్తుల బాధలన్నింటినీ తొలగిస్తాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 12:12 PM IST
Anant Chaturdashi 2022: అనంత చతుర్దశి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

Anant Chaturdashi 2022 Importance: హిందూమతంలో అనంత చతుర్దశికి (Anant Chaturdashi 2022) చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి రోజున జరుపుకుంటారు. దీనిని చౌదాస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రోజున వినాయకుని నిమజ్జనం చేస్తారు. ఈసారి అనంత చతుర్దశి పండుగను సెప్టెంబర్ 9, 2022 శుక్రవారం జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీహరిని పూజించడం వల్ల మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. 

శుభ ముహూర్తం
అనంత చతుర్దశి  8 సెప్టెంబర్ 2022న రాత్రి 9.02 గంటల నుండి 9 సెప్టెంబర్ 2022 సాయంత్రం 6:07 వరకు ఉంటుంది. ఉదయం తిథి ఆధారంగా అనంత చతుర్దశి సెప్టెంబరు 9న జరుపుకోనున్నారు. 

పూజ ముహూర్తం
అనంత చతుర్దశి పూజ ముహూర్తం: సెప్టెంబర్ 9 ఉదయం 06:02 నుండి సాయంత్రం 06.09 వరకు.
పూజ వ్యవధి: 12 గంటల 6 నిమిషాలు

పూజ విధానం
అనంత చతుర్దశి వ్రతం మహాభారత కాలం నుండి ప్రారంభమైంది. ఈ రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత పూజ మందిరాన్ని శుభ్రం చేసి... దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించి..పూజించండి. పూజ సమయంలో దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించండి. విష్ణువుకు పసుపు రంగు చాలా ఇష్టమైనది, కావున ఈ రోజు పూజలో పసుపు పువ్వులు, స్వీట్లు మెుదలైన వాటిని దేవుడి ముందు పెట్టండి. చివరగా పూజలో ఉంచిన రక్ష దారాలను పురుషుల కుడిచేతికి, స్త్రీల ఎడమచేతికి కట్టుకోండి. 

Also Read: Kajari Teej 2022: కజారీ తీజ్ వ్రతం అంటే ఏంటి? దీనిని ఎవరు జరుపుకుంటారు? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News