Samudra Shastra:  చేతికి 6 వేళ్లు ఉన్న వ్యక్తులను మీరు చూసే ఉంటారు. అయితే చేతిలో 6 వేళ్లు ఉండటం వెనుక అనేక ప్రత్యేక సంకేతాలు దాగి ఉన్నాయని సాముద్రిక శాస్త్రంలో (Samudrik Shastra) పేర్కొనబడింది. సముద్ర శాస్త్ర ప్రకారం, బుధ గ్రహ ప్రభావం వల్ల 6 వేళ్లు ఉన్నవారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. అలాంటి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తుల పని సామర్థ్యం మిగిలిన వారి కంటే వేగంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరు చాలా తెలివైనవారు
చేతిలో 6 వేలు ఉన్నవారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తులు తరచుగా ఇతరుల పనిని విమర్శిస్తారు. వీరు వివిధ పనులలో సమతుల్యతను కాపాడుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. వీరికి తమ తెలివిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసు. మత గ్రంధాల ప్రకారం, వీరికి ప్రయాణం అంటే ఇష్టం. చేతిలో 6 వేలు ఉన్న వ్యక్తులు తమ కష్టపడి, నిజాయితీతో డబ్బు సంపాదించడానికి ఇష్టపడతారు. అలాంటి వ్యక్తులు క్రీడాకారులుగా, కళాకారులుగా కూడా రాణిస్తారు.


బుధ, శుక్ర గ్రహాల ప్రభావం
సముద్ర శాస్త్రంలో (Samudra Shastra) చేతి లేదా పాదాల చిటికెన వేలు దగ్గర అదనపు వేలు ఉన్న వ్యక్తులపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పబడింది. మరోవైపు, బొటనవేలు దగ్గర అదనపు వేలు ఉన్న వ్యక్తులపై, వీనస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.


Also Read: Mars Transit 2022: త్వరలో మేషరాశిలోకి కుజుడు... ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి