Sankashti Chaturthi 2022: సంకష్టి చతుర్థి నాడే సర్వార్థ సిద్ధి యోగం! గణేశుడిని ఇలా పూజించండి..
Sankashti Chaturthi June 2022: సంకష్ట చతుర్థి రోజున ఉపవాసం ఉండి.. గణపతిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని ఆటంకాలు తొలగిపోతాయి.
Sankashti Chaturthi June 2022 Puja Muhurat Chandrodaya time: గణేశుని అనుగ్రహం పొందడానికి సంకష్టి చతుర్థి ఉత్తమమైన రోజు. రేపు అంటే జూన్ 17న సంకష్ట చతుర్థి వ్రతాన్ని (Sankashti Chaturthi June 2022) ఆచరిస్తారు. జూన్ 17న ఆషాఢ మాసం కృష్ణ పక్ష చతుర్థి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సర్వార్థ సిద్ధి యోగం కూడా ఈ రోజే ఏర్పడుతోంది. ఈ యోగంలో చేసే పూజలు మరియు శుభ కార్యాలు అనేక ఫలాలను ఇస్తాయి. గణేశుడు సంతోషించి...మీకు విజయాన్ని మరియు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఈ సంకష్తి చతుర్థి నాడు పూజించడానికి అనుకూలమైన సమయం మరియు చంద్రోదయ సమయం గురించి తెలుసుకుందాం.
సంకష్టి చతుర్థి 2022 ముహూర్తం
ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి జూన్ 17వ తేదీ శుక్రవారం ఉదయం 06:10 గంటలకు ప్రారంభమై జూన్ 18వ తేదీ శనివారం తెల్లవారుజామున 02:59 గంటలకు ముగుస్తుంది. మరోవైపు జూన్ 17వ తేదీ సంకష్ట చతుర్థి ఉదయం 09:56 నుండి జూన్ 18వ తేదీ ఉదయం 05:03 వరకు సర్వార్థ సిద్ధి యోగం. మరోవైపు జూన్ 17న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:25 గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. చంద్రునికి అర్ధార్పణ లేకుండా సంకష్టి చతుర్థి పూజలు పూర్తికావు. ఈ సంకష్ట చతుర్థి నాడు చంద్రోదయ సమయం రాత్రి 10:03.
సంకష్టి చతుర్థి పూజ ఎలా చేయాలి?
సంకష్తి చతుర్థి రోజున తెల్లవారుజామున స్నానమాచరించి శుభముహూర్తంలో వినాయకునికి అభిషేకం చేయండి. వారికి చందనం, మోదకం, పండ్లు, పుష్పాలు, వస్త్రాలు, ధూపం, దీపం, వాసన, అక్షతం, దుర్గం మొదలైన వాటిని సమర్పించండి. అలాగే ఈ రోజున గణేష్ చాలీసా చదవండి మరియు సంకష్టి చతుర్థి ఉపవాసం యొక్క కథను వినండి. చివరిగా వినాయకుడికి హారతి ఇవ్వండి. రాత్రి చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి...ఉపవాస దీక్షను ముగించండి.
Also Read: Numerology: ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు తక్కువ టైంలోనే కోటీశ్వరులవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook