Santhana Saptami Significance: పెళ్లయి చాలా ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోతే సంతాన సప్తమి వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతంలో పార్వతీపరమేశ్వరులను పూజిస్తే... దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు. ఈ ఏడాది సంతాన సప్తమి వ్రతం (Santan Saptami Vratam 2022) ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేదీ, శుభ ముహూర్తం
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఏడో రోజున సంతాన సప్తమి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈసారి ఇది సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:51 గంటలకు ప్రారంభమై...  సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12.28 గంటల వరకు ఉంటుంది. అయితే ఉదయతిథి ఆధారంగా సంతాన సప్తమి వ్రతాన్ని సెప్టెంబర్ 3వ తేదీన జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి శనివారం ఉదయం 7.35 నుండి 9.10 వరకు సమయం శుభప్రదమైనది. ఇది కాకుండా మీరు ఉదయం 11.55 నుండి మధ్యాహ్నం 12.46 వరకు కూడా పూజలు చేసుకోవచ్చు. ఈ రెండు వీలుకాకపోతే మధ్యాహ్నం 1.55 నుండి సాయంత్రం 5:5 గంటల మధ్య ఈ వ్రతాన్ని జరుపుకోండి. 


వ్రత ప్రాముఖ్యత
సంతానం సప్తమి వ్రత సమయంలో శివుడు మరియు తల్లి పార్వతిని పూజిస్తారు. సంతానం, పిల్లల ఆరోగ్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. విశేషమేమిటంటే అపరాజిత సప్తమి, ముక్తాభరణ సప్తమి మరియు లలితా సప్తమి కూడా సంతాన సప్తమి రోజునే జరుపుకుంటారు.


Also Read: కన్యారాశిలో లక్ష్మీ నారాయణ యోగం... అంతులేని సంపద ఈ రాశుల సొంతం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook