Saturday Remedies: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ధనవంతులయ్యేందుకు చాలా మార్గాలున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు దూరమయ్యేందుకు శనివారం నాడు ఇలా చేస్తే చాలు. అన్ని కోర్కెలు పూర్తవుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారమనేది శనిదేవుడికి సమర్పితం. ఈ రోజున విధి విధానాలతో పూజలు చేస్తే అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం పంచమి తిధి జూన్ 18 వతేదీ శనివారం నాడు ఉంది. ఈ రోజు 1 గంట 50 నిమిషాలకు వైద్యుతి యోగముంది. ఈ యోగంలో స్థిరకార్యాలు చేస్తారు. కానీ హడావిడి కార్యక్రమాలు మాత్రం పొరపాటున కూడా చేయకూడదు. శనివారం నాడు శుభప్రదం జరగడానికి, వ్యాపారంలో ప్రగతికి, కోర్టు వివాదాల్నించి విముక్తులయ్యేందుకు, సక్సెస్ కోసం శనివారం నాడు ఈ పద్థతుల్ని పాటించాలి.


మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావాలనుకుంటే..శనివారం నాడు మంగళమంత్రం పఠించాలి. ఈ రోజున ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమహ జపించడం వల్ల అప్పుగా ఇచ్చి డబ్బు వెంటనే తిరిగొస్తుంది. కెరీర్లో వచ్చే కష్టాలు, మంచి ఉద్యోగం కోసం శనివారం ఉదయం స్నానమాచరించి శివుని ఆలయంలో షమీ ఆకులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు దూరమౌతాయి. 


కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉండేందుకు శనివారం నాడు హనుమంతుడికి తేనె సమర్పించడం వల్ల లాభాలుంటాయి. దాంతోపాటు ఓం హ హనుమన్తే నహ మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. శుభప్రదం కోసం శనివారం నాడు షమీ చెట్టును పూజించాలి. పిల్లల్ని తెలివైనవాళ్లుగా తీర్దిదిద్దేందుకు ఆ రోజు ఉదయం స్నానం తరువాత పిల్లలతో కలిసి హనుమంతుడి ఆలయానికి వెళ్లాలి. దాంతోపాటు శివుని ఆలయానికీ వెళ్లాలి. శివలింగపై పాలు కలిపిన నీళ్లను అభిషేకించాలి. అటు ధన సంపదనల కోసం స్నానం తరువాత 1.25 కిలోల బియ్యాన్ని శివాలయంలో శివుని పాదాల వద్ద అర్పించాలి. బలం, బుద్ధి కోసం కేసరి రంగు సిధూరంలో కాస్త సంపెంగ నూనె వేసి..ఆలయ పూజారికి ఇవ్వాలి. లేదా స్వయంగా హనుమంతుడికి సింధూరం పెట్టవచ్చు.


Also read: Saturday Astro Remedies: శనివారం పాటించాల్సిన నియమాలు.. సమస్యలన్నీ దూరమై సంపద పెరిగే మార్గం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook