Shani Surya conjunction in Kumbh Rashi 2024: మనం చేసే కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. ఇతడు రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మారుస్తాడు. 30 సంవత్సరాల తర్వాత కర్మ ఫలదాత అయిన శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. గ్రహాల రాజైన సూర్యుడు ఫిబ్రవరి 13న మకర రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే రాశిలో భాస్కరుడు మార్చి 14 వరకు ఉంటాడు. కుంభరాశిలో తండ్రీకొడుకులు కలయిక వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి 
ఇదే రాశిలో సూర్యుడు మరియు శని గ్రహాల కలయిక జరగబోతుంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సంపద పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. 
సింహ రాశి 
సూర్య, శనిదేవుడి కలయిక వల్ల సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పెద్ద ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధిస్తారు. మీ దాంపత్య జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు ఏ జాబ్ కోసం అయితే ఇంటర్వ్యూకు వెళ్తున్నారో అది సఫలీకృతమవుతోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. 


Also read: Vastu Tips: ఇంట్లోకి రాగానే టెన్షన్ మొదలవుతుందా? ఇది వాస్తు దోషమా? తప్పక తెలుసుకోండి..


ధనుస్సు రాశి 
కుంభరాశిలో తండ్రీకొడుకుల కలయిక ధనస్సు రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టుతో మీరు దేనినైనా సాధిస్తారు. మీకు ఉపాధి లభిస్తుంది. దేనిలోనైనా పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.


Also Read: Dream Meaning: కలలో బిడ్డ పుట్టడం మీకు ఏ సూచనో తెలుసుకోండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook