Shani Margi: 2024లో శనిదేవుడి కోపానికి గురయ్యే రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
Shani Margi 2024: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయమూర్తి అని పిలుస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో శని గ్రహం గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు పడనున్నారు.
Saturn Direct Movement 2024 effect: పురాణాల ప్రకారం, శనిదేవుడు..సూర్యదేవుడు కుమారుడు. హిందువులు శనిదేవుడు అంటేనే భయపడతారు. ఎందుకంటే అతడి వక్రదృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అయితే శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. మీ జాతకంలో శని ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని కదలిక మీ కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. త్వరలో అదే రాశిలో రివర్స్ నుంచి నేరుగా నడవనున్నాడు. శని గమనంలో మార్పు కొత్త సంవత్సరంలో కొన్ని రాశులవారికి ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది.
ఈరాశులకు ఇబ్బందులు
శని ప్రత్యక్ష సంచారం కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం మరియు మీన రాశి వారులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీరు వచ్చే ఏడాది జూన్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యక్ష శని మీరు కెరీర్ లో ఎదగకుండా చేస్తుంది. అంతేకాకుండా మీ వ్యాపారాన్ని దెబ్బతిస్తుంది. మీరు ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుంది. అంతేకాకుండా స్త్రీలను, వృద్ధులను అవమానించేవారిని, మోసాలు చేసేవారిని, జంతువులను హింసించే వారిని శనిదేవుడు కఠినంగా శిక్షిస్తాడు. కాబట్టి శనిదేవుడి కోపం లేదా వక్రదృష్టి లేదా పీడ నుండి విముక్తి పొందాలంటే కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి.
ఇలా చేయండి..
**ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
**పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికీ సహాయం చేయండి.
** పెద్దలు మరియు స్త్రీలను గౌరవించండి.
**నల్ల కుక్క మరియు కాకికి ఆహారం పెట్టండి.
** మంగళ, శనివారాల్లో హనుమంతుడిని పూజించి..హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ పఠించడం వల్ల మీకు శనిగ్రహ బాధల నుండి విముక్తి లభిస్తుంది.
Also Read: Guru Shani Gochar: శని, గురు గ్రహలు సంచారంతో డిసెంబర్ 31 నుంచి ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి