Shani Margi 2023 in November: న్యాయదేవుడైన శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 04న శనిదేవుడు నేరుగా నడవడం మెుదలుపెట్టనున్నాడు. శని గ్రహం యెుక్క ఈ ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశులవారు లాభం పొందడమే కాకుండా శని సాడేసతి మరియు దైయా నుండి ఉపశమనం పొందనున్నారు. శని మార్గి ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడతారు. అకస్మిక ధనలాభం ఉంటుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపొయి.. పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి దక్కే అవకాశం ఉంది. మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి.
సింహరాశి 
శని మార్గి సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు అప్పుల నుండి విముక్తి పొందుతారు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
కుంభ రాశి
ఇదే రాశిలో నవంబరు 04 నుంచి శని నడవడం మెుదలుపెట్టనున్నాడు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
ఈ రాశులకు విముక్తి
శని ప్రత్యక్ష సంచారం వల్ల మీనం, మకరం, కుంభం, కర్కాటకం, వృశ్చికం రాశుల వారు శని సాడేసతి లేదా ధైయా నుండి బయటపడతారు. వీరి సమస్యలన్నీ తీరిపోతాయి. 


Also Read: Pregnancy : ఈరోజే పవర్ఫుల్ చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తప్పక ఇవి పాటించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook