Shani Remedies: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం అశుభంగా ఉంటే ఆ వ్యక్తి చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అదే శుభప్రదంగా ఉంటే..ఆ వ్యక్తికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. శని అశుభ ప్రభావాన్ని దూరం చేసేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని అశుభ ప్రభావం నుంచి రక్షించుకునేందుకు ప్రతి వ్యక్తి ఏదో ఒక మార్గం ఆచరించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయం పాటిస్తే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. కుండలిలో శని స్థితి ఆధారంగా ప్రత్యేక రాశి కలిగిన వ్యక్తికి శుభం లేదా అశుభ ఫలాలు లభిస్తాయి. శనిదేవుడు వ్యక్తి మంచి పనులకు మంచి ఫలాలు లభిస్తాయి. చెడు పనులు చేస్తే మాత్రం ఫలితం చెడుగానే ఉంటుంది. ఒకవేళ మీకు కూడా శని ప్రకోపం నుంచి కాపాడుకోవాలంటే..శనివారం నాడు రాజా దశరధ కృతి శని స్తోత్రం పఠించాలి. మేష రాశి నుంచి మీనరాశివరకూ అందరూ అవలంభించాలి.


రాజా దశరధ కృత శని స్తోత్తం


నమ కృష్ణాయ నీలాయ శితికష్టనిభాయచ
నమ కాలాగ్నిరూపాయ కృతాన్యతాయచ వైనమ


నమో నిర్మాస దేహాయ దీర్ఘశ్యమరుజటాయ చ
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయాకృతే


నమ పుష్కలగాత్రాయ స్థూలరోమ్నోశ్యయ వైనమ
నమో దీర్ఘాయశుష్కాయ కాలద్రష్ట నమోస్తుతే


నమస్తే కోటరాక్షాయ దుర్నిరీక్షాయ వైనమ
నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కపాలినే


నమస్తే సర్వభక్షణాయ వలీముఖాయనమోస్తుతే
సూర్యపుత్ర నమస్తేస్యు భాస్కరే భయదాయ చ


తపసా దగ్ధదేహాయ నిత్య యోగరతాయచ
నమోద నిత్య క్షుధ్యార్య అతృప్తాయచ వైనమ


జ్ఞానచక్షుర్మమస్తేస్యు కశ్యపపాత్యమజ సునవే
తృష్టో దదాసి వైరాజ్య రుష్టో హరసి తత్‌క్షణాత్


ఈ మంత్రాన్ని ప్రతి శనివారం క్రమం తప్పకుండా పఠిస్తే..శనిదోషం కారణంగా ఎదురయ్యే దోషాలు పోతాయి. సమస్యలు దూరమౌతాయి. శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. 


Also read: Saturn Transit 2022: మకరరాశిలో శని ప్రవేశం, జూలై 12 నుంచి 6 నెలల వరకూ ఆ రాశులవారికి జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook