Shani Dev: ఈ ఏడాది శని గమనంలో కీలక మార్పులు... ఇక ఈ 3 రాశులవారు కోటీశ్వరులే..
Shani Gochar 2024: శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. 2024లో శని గమనంలో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Shani Transit 2024 Effect: మనం చేసే పనులను బట్టి కర్మలను ప్రసాదించే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మ ఫలదాత అని పిలుస్తారు. ఈ ఏడాది శనిదేవుడు మూడు, నాలుగు సార్లు తన స్థానాన్ని మార్చుకోబోతుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. శనిగ్రహ సంచారంలో మార్పుల వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
సింహరాశి
శని గమనంలో మూడు సార్లు స్థానం మార్చడం వల్ల సింహరాశి వారు లాభపడతారు. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. జాబ్ కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులు లాభపడతారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. శని వక్ర దృష్టి మీ మీద పడదు.
కుంభ రాశి
ఈ రాశికి అధిపతి శనిదేవుడు. దీంతో కుంభరాశివారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, కాబట్టి అదుపులో ఉంచుకోండి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పేదరికం నుండి బయటపడతారు. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేరుతుంది.
Also Read: Rahu-Shukra: పుష్కర కాలం తర్వాత రాహువు, శుక్ర కలయిక.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..
వృషభం
ఈ ఏడాది శనిదేవుడి కదలిక వృషభరాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు లాభపడతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది.
Also read: Sankashti Chaturthi 2024: సంకష్టి చతుర్థి రోజు రాత్రి పూట తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter