Saturn Retrograde 2022 effect on all Zodiac Signs:  కర్మ దాత శని 29 ఏప్రిల్ 2022 నుంచి తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు. 6 జూన్ 2022 నుండి అదే రాశిలో తిరోగమనం (Saturn Retrograde 2022) చేయనున్నాడు. శని యొక్క తిరోగమన కదలిక ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రభావం మంచి లేదా చెడు రెండూ కావచ్చు. ఈసారి కూడా కొన్ని రాశుల వారిపై తిరోగమన శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తిరోగమన శని ద్వారా ఏ వ్యక్తులు ఎక్కువగా ప్రభావితమవుతారో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశుల వారికి శుభప్రదం
మేషరాశి (Aries)- శని తిరోగమనం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వారు జీవితంలోని అనేక రంగాలలో ప్రయోజనం పొందుతారు. వృత్తిలో లాభాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ-వ్యాపారంలో వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. 


వృషభం (Taurus)- వృషభ రాశి వారికి శని యొక్క తిరోగమన చలనం శుభప్రదంగా ఉంటుంది. పదోన్నతులు పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు, బదిలీ జరగవచ్చు. పార్టనర్‌షిప్‌లో పనిచేసే వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. ప్రజలతో వాదించవద్దు.


ధనుస్సు (Sagittarius)- తిరోగమన శని ధనుస్సు రాశి వారికి లాభాలను ఇస్తుంది. వీరి కెరీర్‌కు మంచి రోజులు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మరియు ప్రేమ వాతావరణం ఉంటుంది. 


ఈ రాశుల వారిపై చెడు ప్రభావం
మిథునం (Gemini)- తిరోగమన శని మిథునరాశి వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. తోబుట్టువులతో విభేదాలు రావచ్చు.


కర్కాటకం (Cancer)- తిరోగమన శని కర్కాటక రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. ధన నష్టం కలగవచ్చు. కెరీర్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కాస్త వాయిదా వేయండి. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు.


వృశ్చికం (Scorpio) - వృశ్చిక రాశి వ్యక్తులు వివాదంలో చిక్కుకోవచ్చు. ఆస్తి విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు రావచ్చు. కెరీర్ విషయంలో కూడా ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.


మకరం (Capicron)- శని తిరోగమనం కూడా మకర రాశి వారికి సమస్యలను కలిగిస్తుంది. కెరీర్‌ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వివాదాలను నివారించడానికి ప్రయత్నించండి.


కుంభం (Aquarius)- ఈ రాశిలో శని తిరోగమనంలో ఉండటం వల్ల ఈ వ్యక్తులు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. మానసిక ఒత్తిడి, ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంపై చెడు ప్రభావం ఉంటుంది.


Also Read: Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి చాణక్యుడి చెప్పిన 5 అద్భుత సూత్రాలు ఇవిగో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook