Shani Uday 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల ఉదయం మరియు అస్తమయం ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రీసెంట్ గా శనిదేవుడు కుంభరాశిలో అస్తమించాడు. మళ్లీ మార్చి 5న అతడు ఉదయిస్తాడు. శని అస్తమయం వల్ల కర్కాటక, వృశ్చిక రాశులవారు ఇబ్బందులు పడుతుంటే.. శనిదేవుడు ఉదయం వల్ల వృషభ, సింహ, కుంభ రాశులవారు అపారమైన సంపదను పొందనున్నారు. వీరు ఎలాంటి ప్రయోజనాలు పొందనున్నారో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి ఉదయం ఈ రాశులకు శుభప్రదం
కుంభం (Aquarius): శని ఉదయించడం వల్ల కుంభరాశి వారికి మేలు జరుగుతుంది. మీకు సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. 
సింహ (Leo): ఈరాశి వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. సింహరాశికి సూర్యభగవానుడు అధిపతి. శని ఉదయం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులు భారీగా లాభపడతారు. 
వృషభం (Taurus): శనిదేవుడి అనుగ్రహం వల్ల వృషభరాశి వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. బిజినెస్ మెుదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Ketu Gochar 2023: త్వరలో రాహు-కేతు గోచారం.. ఈ రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook