Shani Dev Uday: ఆస్ట్రాలజీ ప్రకారం, అత్యంత నిదానంగా నడిచే గ్రహాల్లో శని ఒకటి. ప్రస్తుతం కుంభరాశిలో అస్తమించిన శని.. మార్చి 6న అదే రాశిలో ఉదయించబోతున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ రైజింగ్ కారణంగా మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ 3 రాశులు ఏంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారు జాగ్రత్త
కర్కాటకం- శనిదేవుడు మీ రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందులోనైనా డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోంటారు. 


వృశ్చికం - ఈ రాశి యెుక్క నాల్గవ ఇంట్లో శని ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మీకు మానసిక సమస్యలు రావచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారులతో విభేదాలు రావచ్చు. ఆఫీసులో మీ పరిస్థితి అంతగా బాగుండదు. ఎందులోనైనా తెలివిగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. 


మీనం - మీన రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో శనిదేవుడు ఉదయించబోతున్నాడు. మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  ఆఫీసులో మీకు శత్రువులు పెరుగుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార నిమిత్తం మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Budh Gochar 2023: రేపటి నుండి ఈరాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.