Trigrahi Yog On Mahashivratri 2023: ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 18న వస్తోంది.  ఈ ఫెస్టివల్ ను ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈరోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈసారి మహాశివరాత్రి నాడు అద్భుతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిగ్రాహి యోగం ఎలా ఏర్పడుతుంది?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 17న శనిగ్రహం తన రాశిని మార్చుకుని కుంభరాశిలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 13న, గ్రహాల రాజు సూర్యుడు, ఫిబ్రవరి 18న చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. కుంభంలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం రూపొందుతుంది. ఈ యోగం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


మేషరాశి
శివుడికి ఇష్టమైన రాశుల్లో మేషరాశి ఒకటి. దీంతో మహాదేవుడు ఆశీర్వాదం ఈ రాశిపై ఎల్లప్పుడూ ఉంటుంది. మహాశివరాత్రి నాడు ఏర్పడబోతున్న త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ పవిత్రమైన రోజున శివుని జలాభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. 
వృశ్చికరాశి
మేష రాశి వారిలాగే వృశ్చిక రాశి వారికి కూడా భోలేనాథ్ ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశిచక్రాన్ని పాలించే గ్రహం మార్స్. ఈరోజున శివుడికి నీటితో అభిషేకం చేయడం వల్ల మీరు శుభఫలితాలను పొందుతారు. శివరాత్రి నాడు మహాదేవుని ఆరాధించడం ద్వారా తెలియని భయం తొలగిపోతుంది 
మకరరాశి 
శని దేవుడిని మకర రాశికి అధిపతిగా భావిస్తారు మరియు శని దేవుడే పరమశివుని పరమ భక్తుడు అని చెబుతారు. త్రిగ్రాహి యోగం మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. 
కుంభ రాశి
ఈరాశికి కూడా శనిదేవుడే అధిపతి. ఈరాశిలోనే త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈరోజున శివుని జలాభిషేకంతో పాటు దానధర్మాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి, విద్య, ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో శుభ ఫలితాలు పొందుతారు. శివుని పూజించడం వల్ల వివాహ జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి.


Also Read: Surya grahan 2023: ఏప్రిల్ లో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులకు కలిసి రానున్న కాలం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook