Saturn Transit 2022: జూలై 12 నుంచి శని గ్రహం రాశి మారనుంది. శని మకర రాశి ప్రవేశం సందర్భంగా కొన్ని రాశులవాళ్లు కొద్దికాలం జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని గ్రహం జూలై 12వ తేదీ ఉదయం 10 గంటల 27 నిమిషాలకు రాశి మారనున్నాడు. ఆ రోజు శని మకర రాశిలో ప్రవేశించనున్నాడు. మరో ఆరు నెలలపాటు అంటే జనవరి 23వ తేదీ 2023 వరకూ శని మకరరాశిలోనే ఉండనున్నాడు. ఆ తరువాత తిరిగి కుంభరాశిలో ప్రవేశిస్తాడు. జూలై 12 నుంచి మరో 6 నెలలవరకూ కొన్ని రాశుల జాతకస్థులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. శని గోచారం కారణంగా ఏయే రాశులపై ప్రభావం పడుతుందో చూద్దాం..


శని దుర్దశ ప్రారంభమైంది. వాదోపవాదాలు మొదలవుతాయి. వాహనాలు జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా దుర్ఘటన జరగవచ్చు. అనవసరమైన ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి.  కర్కాటక రాశి జాతకులు జూలై 12 నుంచి 6 నెల వరకూ అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ధైర్యంగా పనిచేయడం అలవాటు చేసుకుంటే సఫలీకృతులవుతారు. వ్యాపారంలో లాభాలు తగ్గవచ్చు.


ఇక సింహరాశి వారికి దాంపత్య జీవితంలో ఒత్తిడి రావచ్చు. దుర్ఘటనలు జరిగే అవకాశాలున్నాయి. కాస్త అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. తులరాశివారికి శని దుర్దశ ప్రారంభమవుతుంది. పనిచేసేచోట ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో మానసిక కష్టం కలిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీదేవి పూజలు చేయాలి. ధనస్సు రాశివారి కుటుంబంలో వాదోపవాదాలు జరుగుతాయి. 6 నెలలవరకూ అత్తారింటి నుంచి లావాదేవీలు ఆలోచించి చేయాలి. డబ్బులు అప్పులిస్తే హాని కలుగుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కుంభరాశివారికి ఉరుకుపరుగులతో సమస్యలు ఎదురౌతాయి. శత్రువులు అప్రమత్తంగా ఉంటారు. జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ధనహాని కలగవచ్చు.


Also read: Mercury transit 2022: మిధునంలో బుధుడు, జూలై 2 నుంచి అదృష్టం పూర్తిగా మారిపోనున్న మూడు రాశులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook