Saturn Transit 2022: శని ఇవాళ (ఏప్రిల్ 29న) కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. రెండున్నరేళ్ల తర్వాత శని గ్రహం రాశి మారబోతుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. జూలై 12 వరకు శని కుంభరాశిలోనే సంచరిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలలపాటు తిరోగమన దిశ ఉంటుంది. శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే కొన్ని రాశుల వారికి కష్టాలు, నష్టాల నుంచి విముక్తి కల్పిస్తుంది. అదే సమయంలో కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీన రాశి వారికి శని గండం :


శని రాశి మారిన వెంటనే మీన రాశి వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అది వారికి అశుభాలను కలగజేస్తుంది. అలాగే, కర్కాటక, వృశ్చిక రాశి వ్యక్తులపై కూడా శని నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో ఆర్థికంగా నష్టపోవడం, అందరిలో గౌరవం, మర్యాద కోల్పోవడం, మానసిక ఒత్తిడికి గురవడం వంటివి జరుగుతాయి. 


ఈ రాశుల వారికి బాధల నుంచి విముక్తి :


శని మకర రాశిలో ఉన్నంత కాలం ధనుస్సు, మకర, కుంభ రాశులపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ నెల 29న శని కుంభరాశిలోకి మారిన వెంటనే ధనుస్సు రాశి వారికి  బాధల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున, తుల రాశుల వారికి కూడా అన్ని బాధలు, కష్టనష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. మకర రాశి వారు శని చివరి దశ, కుంభరాశి వారు శని రెండో దశలో జాగ్రత్తగా ఉండాలి. 


కర్మను బట్టి ఫలాలు


శని ప్రభావం ఎలా ఉన్నా... అది కూడా కర్మానుసారమే జరుగుతుంది. ఒక వ్యక్తికీ అందరికీ మంచి చేసే గుణం ఉండి... అతని జాతకంలో శని గ్రహస్థితిలో ఉంటే.... అతనిపై చెడు ప్రభావమేమీ ఉండదు. అతనికి అన్ని విధాలా మంచే జరుగుతుంది. తుల రాశి శనికి శ్రేష్ఠమైన రాశిగా చెబుతారు. కాబట్టి వారిపై కూడా శని ప్రభావం ఉండదు. ధనస్సు, మీన రాశులకు అధిపతి అయిన బృహస్పతితో స్నేహం కారణంగా ధనుస్సు రాశి వారికి కూడా ఎలాంటి చెడు జరగదు.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Acharya Live Updates: ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'ఆచార్య'... సినిమాపై లైవ్ అప్‌డేట్స్...


Also Read: Acharya Movie Review: ఆచార్య సినిమా హిట్టేనా..రివ్యూల్లో రేటింగ్ ఎంత..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.