Acharya Live Updates: ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'ఆచార్య'... సినిమాపై లైవ్ అప్‌డేట్స్...

Acharya Movie Live Updates: మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం...

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 10:49 AM IST
  • ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ఆచార్య
  • థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ కోలాహలం
  • ఆచార్య మూవీపై పబ్లిక్ టాక్, రివ్యూలు, ఇతరత్రా విశేషాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి
Acharya Live Updates: ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'ఆచార్య'... సినిమాపై లైవ్ అప్‌డేట్స్...
Live Blog

Acharya Live Updates: మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడం... తొలిసారి తండ్రీకొడుకులు చిరు-చరణ్ సినిమా మొత్తం కనిపించనుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ఆచార్య సినిమాపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం....
 

29 April, 2022

  • 10:49 AM

    ఆచార్య సినిమాలో చిరంజీవి, రాంచరణ్ తరహా పోజులో సన్‌రైజర్స్ టీమ్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్, బౌలర్ ఉమ్రాన్ మాలిక్... 

  • 10:01 AM

    చనిపోయిన సిద్ధ కోరికను ఆచార్య ఎలా నెరవేరుస్తాడన్నదే తర్వాతి కథ... అది తెరపై చూడాల్సిందే..

  • 09:19 AM

    ఆచార్యను ఎలాగైనా చంపాలని విలన్ రాథోడ్ తన గ్యాంగ్‌ను పంపిస్తాడు. ఆ సందర్భంగా ఆచార్య దళానికి, విలన్ గ్యాంగ్‌కి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిద్ధ మరణిస్తాడు. అంతే.. రాథోడ్ నెక్స్ట్ టార్గెట్ 'పాదఘట్టం'.

  • 09:14 AM

    సెకండాఫ్: ఏఓబీలో విలన్ గ్యాంగ్ మైనింగ్... మైనింగ్ కారణంగా పాదఘట్టంలో గ్రామస్తులకు అనారోగ్య సమస్యలు... ఆ సమయంలో ఆచార్య దళం అక్కడికి ఎంటరై మైనింగ్‌ని ఆపేయడం... ఈ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి.

  • 09:03 AM

    సిద్ధ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ రివీల్ అవుతుంది... సిద్ధ ఎవరి కొడుకు అన్నది అతనికి తెలిసిపోతుంది..

  • 08:55 AM

    సిద్ధ ప్రాణాపాయంలో పడుతాడు... ఇంతలో ఆచార్య అతన్ని కాపాడి ఏఓబీకి తీసుకెళ్తాడు... సిద్ధకు ప్రాణాపాయం ఎలా ఎదురైంది... ఆచార్య ఎలా కాపాడాడు అన్నది తెరపై ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది..

  • 08:53 AM

    క్రేజ్ కా బాప్ చిరు... ఆచార్య మూవీ రిలీజ్ వేళ... థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి... 

  • 08:49 AM

    పాదఘట్టంలో టెంపుల్ కూల్చేందుకు రాథోడ్ ఇండస్ట్రీ, బసవ కలిసి ప్లాన్ చేస్తారు..  సిద్ధ ఎంటర్ అయి విలన్స్‌తో ఫైట్ చేస్తాడు.

  • 08:44 AM

    'ఎత్తిన వేళ్లు ముడుచుకుంటాయి... జారిన నోళ్లు మూసుకుంటాయి...' అంటూ ఆచార్య సినిమాపై ఓ ప్రేక్షకుడి టాక్... 

  • 08:42 AM

    నీలాంబరి-సిద్ధ మధ్య లవ్ సీన్స్... ఇప్పుడే 'నీలాంబరి' సాంగ్... పాటలో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

  • 08:35 AM

    ఆచార్య మూవీ ఫస్టాఫ్‌ ఎలా ఉందంటే... ఇదీ ఓ నెటిజన్ రివ్యూ... ఫైట్స్, చిరు స్టెప్స్ సూపర్బ్ అంటూ ట్వీట్ చేశాడు

  • 08:34 AM

    సెకండాఫ్ స్టార్ట్... ధర్మస్థలిలో ఓ దొంగతనం జరుగుతుంది... సిద్ధ ఆ దొంగను పట్టుకుంటాడు. ధర్మస్థలిలో ఉండి ధర్మం తెలుసుకో అని హితబోధ చేస్తాడు. 

  • 08:32 AM

    'సిద్ధ'గా రాంచరణ్ ఇంట్రోతో ఇంటర్వెల్ పడుతుంది... ఓవరాల్‌గా ఫస్టాఫ్ ప్రేక్షకులకు కనెక్టింగ్‌గా ఉంది...

  • 08:28 AM

    'పాదఘట్టం'పై కన్నేసిన బసవ వద్దకు వెళ్లి అతన్ని, అతని అనుచరులను ఆచార్య చితకబాదుతాడు.
     

  • 08:25 AM

    ఆచార్య సినిమాలోని ఓ సన్నివేశం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. చిరంజీవి-సత్యదేవ్ మధ్య సాగే ఈ సన్నివేశంలో... చిరు చేతిలో ఓ పసిబిడ్డను పెడుతాడు సత్యదేవ్. ఆ పసివాడు పెద్దయ్యాక మన ఉద్యమంలో ఉండేలా చేయాలని చిరును కోరుతాడు. ఇద్దరూ లాల్ సలాం నినాదాలిస్తారు.

  • 08:21 AM

    సామాన్యులకే కాదు... సినీ సెలబ్రిటీలకు సైతం చిరు సినిమా అంటే ఫస్ట్ డే చూడాలన్న ఆత్రుత ఉంటుంది. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె 'ఆచార్య' ఫస్ట్ షో చూస్తున్నారు.... 

  • 08:11 AM

    ఆచార్య మూవీ ఎఫెక్ట్... హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్... ఐమ్యాక్స్ వద్ద భారీ కోలాహలంతో రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు... 

  • 08:09 AM

    పాదఘట్టం, ధర్మస్థలి, జీవధార.. ఈ ప్రాంతాల్లో వందల ఏళ్ల అనుబంధాన్ని వీడి అక్కడి ప్రజలు వెళ్లిపోతున్న తరుణంలో.. అప్పుడు 'ఆచార్య' ఎంట్రీ ఇస్తాడు... 

  • 08:07 AM

    బసవ కారణంగా 'పాదఘట్టం' ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది... ఊరిని వీడాల్సిందిగా అక్కడి ప్రజలు ఓ నిర్ణయానికి వస్తారు... ప్రాణాలతో ఉండాలంటే అదొక్కటే మార్గమని భావిస్తారు... ఇంతకీ బసవ వారిని ఎలా భయపెట్టాడనేది తెరపై చూడాలి...
     

  • 08:04 AM

    తప్పుడు ఆరోపణలతో బసవ అనుచరులు వేద (అజయ్)పై దాడికి పాల్పడుతారు... ఆ ఆరోపణలేంటి... ఎందుకు దాడి చేశారనేది ఇంట్రెస్టింగ్...

  • 08:01 AM

    విలన్ బసవ-రాథోడ్ మధ్య సిద్ధవనం కోసం డీల్ జరుగుతుంది... ఈ డీల్ ఏంటన్నది ఆక్తికరం...

    సిద్ధవనం అడవిపై బసవ కన్ను పడుతుంది... దీనికోసం రాథోడ్‌తో డీల్... పాదఘట్టం గ్రామస్తులను తరిమేయాలని ఇద్దరు ప్లాన్ చేస్తారు...

  • 08:00 AM

    విలన్ బసవను రాథోడ్ కలుస్తాడు... ఇద్దరి మధ్య సీరియస్‌గా సాగే ఈ సీన్ కథను మరింత ఆసక్తిగా మారుస్తుంది...

  • 07:57 AM

    ఘట్టమ రథోత్సవంలో బసవను తప్పించి... పదఘట్టం వాళ్లు రథం లాగేలా చేస్తారు చిరంజీవి... ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది...
     

  • 07:57 AM

    కామ్రేడ్ శివుడు వివాహానికి ఆచార్య చిరంజీవి వెళ్తారు.... ఇక్కడే ఐటెం సాంగ్ 'సానా కష్టం'.... ఈ పాటలో చిరు స్టెప్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. 

  • 07:54 AM

    మ్యూజిక్ టీచర్ నీలాంబరి ఆ చిన్నారిని ఫ్లూట్ గురించి అడుగుతుంది... 

  • 07:53 AM

    చిరంజీవి ఓ చిన్నారికి 'ఫ్లూట్'ను గిఫ్ట్‌గా ఇచ్చాడు... ఆ చిన్నారి మరెవరో కాదు... అది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది...

  • 07:51 AM

    విలన్ 'బసవ' అనుచరుడు ఓబులుతో చిరంజీవి ఫైట్... ఓబులును చిరంజీవి చితక్కొట్టేశాడు...

     

  • 07:50 AM

    చిరు-సంగీత.. 'లాహే లాహే..' పాట స్టార్ట్ అయింది... సాంగ్ పిక్చరైజేషన్ ఆకట్టుకునేలా ఉంది... 

  • 07:44 AM

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి రానే వచ్చేశారు... ధర్మస్థలిలో ఆయన ఇప్పుడే అడుగుపెట్టారు...

  • 07:42 AM

    మహేష్ వాయిస్ ఓవర్ తర్వాత... విలన్ బసవ ఎంట్రీ సీన్.... బసవగా సోను సూద్ ఎంట్రీ సీన్ బాగుంది...

  • 07:39 AM

    'పదఘట్టం' గురించి మహేష్ బాబు వాయిస్ ఓవర్‌ మొదలైంది... థియేటర్‌లో ప్రేక్షకుల ఈలలు... గోలలు... 

Trending News