Saturn Transit 2023, Saturn enters Aquarius after 30 years: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2023 జనవరి 17న శని గ్రహం రాశిని మార్చుతుంది. శని గ్రహం తన స్వంత రాశిచక్రం కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది. 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలోకి శని రానున్నాడు. ఈ శని సంచారం మొత్తం 12 రాశుల మీద పెను ప్రభావం చూపుతుంది. శని గ్రహం 2025 మార్చి 29 వరకు కుంభ రాశిలో ఉంటుంది. కుంభ రాశిలో శని ప్రవేశించడం వల్ల 'షష రాజయోగం' కలుగుతుంది. షష్ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏ రాశి వారికి శని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సంచారం ద్వారా ఏర్పడిన 'షష రాజయోగం' కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వృషభం, మిథునం, తులా, ధనుస్సు రాశుల వారికి శని సంచారం చాల ప్రయోజనకరంగా ఉంటుంది. జనవరి 17 నుంచి ఈ రాశుల వ్యక్తుల జీవితాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. వారికి ఉద్యోగ-వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. 


వృషభం: 
శని సంచారం వృషభ రాశి వారికే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పటివరకు ఉన్న ఆటంకాలు ఇప్పుడు తొలగిపోతాయి. కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయాలు ఉంటాయి. కెరీర్‌లో మంచి పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.


మిథునం:
శని రాశి మార్పు మిథున రాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న శని మొత్తం పోతుంది. శని విడుదల వల్ల జీవితంలో కష్టాలు, సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. 


తులా: 
శని సంచారం వలన తులా రాశి వారికి కూడా శని పూర్తిగా తొలగిపోతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. జీవితంలో సమస్యలు తీరుతాయి. గొప్ప పురోగతి ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మానసిక సంతోషాన్ని, శాంతిని పొందుతారు.


ధనుస్సు: 
కుంభ రాశిలోకి శని ప్రవేశం వల్ల ధనుస్సు రాశి వారికి శని నుంచి విముక్తి కలుగుతుంది. దాంతో ఇప్పటివరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఆర్ధికంగా బాగా ఉంటుంది. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. 


Also Read: వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్‌.. స్టార్ పేసర్ ఔట్‌! మాలిక్‌కు చోటు


Also Read: Mercury Transit 2022: గ్రహాల తిరోగమనం వల్ల చాలా ఏళ్ల తర్వాత ఈ రాశువారు ఊహించని లాభాలు పొందబోతున్నారు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.