Mohammed Shami: వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్‌.. స్టార్ పేసర్ ఔట్‌! మాలిక్‌కు చోటు

Mohammed Shami Out from Bangladesh ODI Series. గాయం కారణంగా సీనియర్‌ పేసర్‌ మొహ్మద్ షమీ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 3, 2022, 12:13 PM IST
  • వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్‌
  • స్టార్ పేసర్ ఔట్‌
  • ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు
Mohammed Shami: వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్‌.. స్టార్ పేసర్ ఔట్‌! మాలిక్‌కు చోటు

Umran Malik to replace Mohammed Shami in India ODI squad for Bangladesh series: బంగ్లాదేశ్‌తో ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా సీనియర్‌ పేసర్‌ మొహ్మద్ షమీ వన్డే సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు. భుజం గాయంతో షమీ తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఇక షమీ స్థానంలో యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. ఆదివారం బంగ్లాదేశ్‌, భారత్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. 

'టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన అనంతరం నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌లో మొహ్మద్ షమీకి గాయమైంది. ప్రస్తుతం షమీ బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లే జట్టుతో పాటు అతడు వెళ్లలేదు. షమీ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ భారత జట్టులోకి వచ్చాడు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. అయితే షమీ గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వన్డే సిరీస్‌తో పాటు డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కూ షమీ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. 

'వన్డే సిరీస్‌కు సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ లేకపోవడం పెద్ద లోటే. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరిలో టెస్టు సిరీస్‌కూ షమీ దూరమైతే టీమిండియాకు ఆందోళన కలిగించే విషయమే’ అని ఓ బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. జూన్‌లో ఓవల్‌లో జరగబోయే ప్రపంచకప్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే.. ఇకపై భారత్ ఆడే ప్రతి టెస్ట్ మ్యాచ్‌ గెలవాల్సి ఉంది. మొహ్మద్ షమీ ఇప్పటి వరకూ 60 టెస్టు మ్యాచ్‌ల్లో 216 వికెట్లు తీశాడు. బంగ్లా పర్యటనలో భారత్ రెండు టెస్టులు ఆడనుంది.

బంగ్లాదేశ్‌తో వన్డేలకు భారత్ జట్టు ఇదే:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైఎస్‌ కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), షాబాజ్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మొహ్మద్ సిరాజ్‌, దీపక్‌ చహర్‌, కుల్‌దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌. 

Also Read: Viral Leave Letter: మా అమ్మ 5న చనిపోతది.. సెలవులు కావాలి! వైరల్ అవుతోన్న టీచర్స్ లీవ్ లెటర్స్  

Also Read: HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News