Shani Asta 2023: కొత్త సంవత్సరం మెుదలైంది. ఈ నెల ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు కూడా ప్రారంభమయ్యాయి. కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత తన సొంతరాశిలోకి ప్రవేశించనుంది. జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలోకి (Saturn transit in Aquarius 2023) ఎంటర్ అవ్వనుంది. శని సంచరించిన ఏడు రోజుల్లోనే కొన్ని రాశులపై శని సడేసతి ప్రారంభమై.. మరికొన్ని రాశులపై అది ముగుస్తుంది. అంతేకాకుండా శనిగ్రహం జనవరి 30న అస్తమించనుంది. మార్చి 6 వరకు శని ఇదే స్థితిలో ఉంటుంది. ఆ తర్వాత అది ఉదయిస్తుంది. కేవలం 15 రోజుల్లోనే శనిస్థానంలో రెండు మార్పులు రానున్నాయి. ఇది మూడు రాశులవారికి ప్రయోనకరంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): జనవరి 2023లో శని సంచారం ఆపై శని అస్తమించడం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. 


తుల రాశి (Libra): శని రాశి మార్పు తులారాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు శని సడేసతి నుండి విముక్తి పొందుతారు. జీవితంలో ఆనందం ఉంటుంది. తులారాశి వారికి శని సంచారం మరియు శని అస్తమించడం కూడా శుభప్రదంగా ఉంటుంది. వీరి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. కొత్త ఉద్యోగం దొరుకుతుంది. విద్యార్థులు రాణిస్తారు. జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారం వృద్ది చెందుతుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


మకరం (Capricorn): శనిదేవుడు మకరరాశి నుండి కుంభరాశిలోకి మారబోతోంది. అనంతరం అదే రాశిలో అస్తమిస్తుంది. దీని కారణంగా మకరరాశివారికి మంచి ఫలితాలను సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. బిజినెస్ లో భారీ డీల్ కుదుర్చుకుంటారు. 


Also Read: Jupiter Transit 2023: బృహస్పతి స్థానంలో పెను మార్పులు.. ఈ 3 రాశులకు అద్భుతమైన కెరీర్, భారీగా డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U     


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.