Saturn Transit 2023: జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత తన మూల త్రికోణ రాశి కుంభంలో ప్రవేశించి నెలరోజులకు పైగా శక్తివంతుడిగా గోచారం చేస్తున్నాడు. దీని ప్రభావం 3 రాశులపై అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఏయే రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని గ్రహం జనవరి 17వ తేదీన కుంభరాశిలో ప్రవేశించాడు. కుంభరాశిలో గోచారం చేస్తూ చేస్తూ మార్చ్ 13 నాటికి శని గ్రహం శక్తివంతుడిగా మారిపోయాడు. ప్రస్తుతం కుంభరాశిలో శని చాలా పటిష్టమైన, బలోపేతమైన స్థితిలో ఉన్నాడు. ఈ ప్రభావం ముఖ్యంగా 3 రాశులపై స్పష్టంగా పడనుంది. శని శక్తివంతుడైనందున, శని కటాక్షంతో ఆ మూడు రాశులవారికి ఊహించని ధనలాభం కలగనుంది. అన్నింటా అభివృద్ధి కలుగుతుంది. అదృష్టం తోడుగా ఉండటంతో ప్రతి పని చక్కగా పూర్తవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.


మిథున రాశి


మిథున రాశి జాతకులకు శని గ్రహం శక్తివంతంగా మారడం అదృష్టాన్ని తిరగరాయనుంది. ఈ జాతకులకు అదృష్టం పూర్తిగా తోడుగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. ఏదైనా పని విషయంలో కీలక విజయం సిద్ధిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు దరిచేరవు.


వృషభ రాశిపై ప్రభావం


శని తన మూల త్రికోణం కుంభరాశిలో శక్తివంతుడిగా మారి తిరుగుతుండటం వల్ల వృషభ రాశి జాతకులకు అదృష్టం తోడుగా ఉంటుంది. శని బలోపేతమయ్యే కొద్దీ అదృష్టం కూడా కలిసి రావడం ఉంటుంది. కెరీర్ పరంగా విజయం ఉంటుంది. ఉన్నత పదవులు అధిరోహిస్తారు. వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది. విదేశాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి.


తుల రాశి


శని తన రాశిలో అత్యంత ప్రభావితమైన తిరుగుతున్నందున తులా రాశి జాతకులకు అంత మంచి జరుగుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందుల్లేవు. తుల రాశికి అధిపతి శుక్రుడు అయినందున ఈ జాతకం వారికి సంతాన సుఖం ప్రాప్తిస్తుంది. పిల్లలకు సంబంధించి గుడ్‌న్యూస్ వింటారు.


Also read:  Maa Lakshmi: బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే... మీపై డబ్బు వర్షం కురిపించనున్న లక్ష్మీదేవి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook