Shani Dev Blessings: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఏ వ్యక్తి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. శనిగ్రహం వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో వారు సర్వనాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. జనవరి 17న న్యాయదేవుడైన శనిదేవుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ సంచారం వల్ల శని  మహాదశ నుండి కొందరు విముక్తి పొందుతారు. మరికొందరికి  ఇబ్బందులు పెరుగుతాయి. జనవరి 16వరకు శనిదేవుడు మకరరాశిలో (Saturn transit 2023) ఉంటాడు. మకర రాశిలో శని సంచారం వల్ల వృషభ, వృశ్చిక, మీన రాశుల వారు లాభపడనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యతో సంబంధం ఉన్నవారు ఈసమయంలో లాభపడతారు. 


వృశ్చిక రాశి (Scorpio)- ఈ రాశి వారు చేసే పనులన్నింటిలోను విజయం సాధిస్తారు. ఆర్థికంగా మీకు బాగుంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో భారీగా లాభపడతారు. జనవరి 16 తర్వాత ఈరాశి వారిపై శని ధైయా మెుదలవుతుంది. 


మీనం (Pisces)- మకరరాశిలో శని సంచారం వల్ల మీన రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు భారీగా ధనలాభం పొందుతారు. ఈ సమయం జనవరి 16 వరకు మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


Also Read: Grah Gochar 2023: జనవరిలో 5 గ్రహాల సంచారం... ఈ రాశుల జీవితం కష్టాలమయం.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U   


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.