Shani Margi 2022 Positive Effect on Zodiacs: దీపావళి పండుగకు 2 రోజుల ముందు జరుపుకునే ధనత్రయోదశి (Dhanteras 2022) నుండి కొందరికి బంగారు రోజులు మెుదలుకానున్నాయి. ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబరు 23న వస్తుంది. ఆ రోజు నుంచే శనిదేవుడు మకరరాశిలో ప్రత్యక్ష సంచారంలోకి (Saturn Transit 2022) వస్తాడు. ఇది 3 రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా వీరికి కుబేరుడి ఆశీస్సులు ఉంటాయి. ఈ సంవత్సరం ధనత్రయోదశి, దీపావళి ఎవరికి శుభప్రదమైనదో మరియు శనిదేవుడు ఏ రాశులవారిపై అనుగ్రహం కురిపిస్తాడో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): ఈ సంవత్సరం ధంతేరాస్‌ మరియు దీపావళి మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మార్గీ శని అనుగ్రహం వల్ల వీరికి ఎంతో మేలు జరుగుతుంది. మీరు కష్టపడి పనిచేస్తే కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ధనలాభం కూడా ఉంటుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో సంతోషం నెలకొంటుంది.


సింహం (Leo): సింహ రాశి వారికి మార్గి శని చాలా ప్రయోజనాలను ఇస్తుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉగ్యోగంలో ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందుతారు. మీ ఆర్థికస్థితి బలపడుతుంది. 


తుల (Libra): శని ప్రత్యక్ష సంచారం వల్ల తుల రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు రుణ విముక్తి పొందుతారు. కొత్త ఉద్యోగం పొందుతారు. కొన్ని శుభవార్తలు మీ హృదయాన్ని సంతోషపరుస్తాయి. 


Also Read: Surya- Shukra Gochar 2022: రేపు కన్యారాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక... ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook