జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ప్రారంభమే శనిగ్రహం ప్రకారం మహత్వపూర్వకంగా మారింది. ప్రారంభంలోనే జనవరి 17న కుంభరాశిలో ప్రవేశించింది. ఇప్పుడు మరో 11 రోజుల్లో శనిగ్రహం నడకలో మార్పు కారణంగా ఆ నాలుగు రాశులవారిపై ధనవర్షం కురవనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం శని కుంభరాశిలో గోచారం 30 ఏళ్ల అనంతరం జరుగుతోంది. కొన్ని రోజుల్లో అంటే కేవలం 11 రోజుల వ్యవధిలో జనవరి 30వ తేదీ 2023న శని తన మూల త్రికోణ రాశి కుంభరాశిలో స్థిరం కానున్నాడు. అంటే 15 రోజుల వ్యవధిలోనే శని నడకలో మార్పు కారణంగా 12 రాశులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా 4 రాశులవారికి శని నడక మార్పు అత్యంత లాభదాయకంగా మారుతోంది. 


మేషరాశి


శని గోచారం, శని నడక మార్పు ప్రభావం మేషరాశి జాతకులపై అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఈ జాతకుల కెరీర్ లో ఊహించని లాభాలు కలుగుతాయి. పదోన్నతులు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ప్రయోజనకరం. వ్యాపారం పెరుగుతుంది. విద్యార్ధుల పరీక్షకు తోడ్పాటు లభిస్తుంది. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కోర్కెలు నెరవేరుతాయి.


వృషభరాశి


జనవరి 17వ తేదీ శని గోచారం, ఆ తరువాత జనవరి 30న శని నడక మార్పుతో వృషభరాశి జాతకులకు అత్యంత లాభదాయకమౌతోంది. ఉద్యోగాల్లో పదోన్నతి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో దీర్ఘకాలంగా మీరు ఎదురుచూస్తున్న సాఫల్యం సాకారమౌతుంది. మీ గౌరవం మరింతగా పెరుగుతుంది. ఇప్పటి వరకూ జీవితంలో ఉన్న సమస్యలు దూరమౌతాయి.


కన్యారాశి


కన్యారాశి జాతకులకు  శని నడక మార్పు లాభం కల్గించనుంది. శత్రువులు ఓడిపోతారు.  వ్యాధుల్నించి విముక్తి పొందుతారు. కుటుంబసభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాహసం, పరాక్రమం పెరుగుతుంది. మీ పనులు వేగంగా పూర్తవుతాయి. పెను సమస్య తప్పుతుంది. వ్యాపారులకు మంచి అనువైన సమయం.


మకరరాశి


శనిగ్రహం మకరరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించాడు. ఇప్పుడు జనవరి 30 కుంభరాశిలోనే స్థిరం కానున్నాడు. ఈ రెండు మార్పులు మకరరాశి జాతకులకు శుభసూచకం కానుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. పనులు వేగంగా పూర్తవుతాయి.


Also read: Astro Tips for pooja mandir: ఇంట్లోని పూజా మందిరంలో ఈ చిహ్నాలుంటే..ఇక అంతా ఐశ్వర్యమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook