Shani Dev Vahan: శనిదేవుడి యెుక్క 9 వాహనాలు ఏంటో తెలుసా?
Shani Dev Vahan: ఆస్ట్రాలజీ ప్రకారం, మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. ఇతడి వాహనం కాకి. అయితే శనిదేవుడికి ఇంకా కొన్ని వాహనాలు ఉన్నాయంట. అవేంటో తెలుసుకుందాం
Shani Dev Vahan: గ్రంథాల ప్రకారం, ప్రతి దేవుడి లేదా దేవతకు వారి వారి స్వంత వాహనాలు ఉన్నాయి. శివుడికి నంది, విష్ణువుకు గరుడు, దుర్గాదేవికి సింహం, వినాయకుడికి ఎలుక, కుమారస్వామికి నెమలి వాహనం ఉన్నట్లు శనిదేవుడికి కూడా కాకి వాహనంగా కలదు. అయితే శనిదేవుడికి కాకి మాత్రమే కాదు..ఇంకో 9 వెహికల్స్ కూడా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. మీ జాతకం, నక్షత్రం మరియు తేదీల గణన ఆధారంగా శనిదేవుడి వాహనం నిర్ణయించబడుతుంది. శనిదేవుడి యెుక్క వాహనాలు, వాటి ప్రభావాలు గురించి తెలుసుకుందాం.
శనిదేవుడి వాహనాలు, వాటి ప్రాముఖ్యత
** శనిదేవుడు గేదెపై స్వారీ చేయడం అనేది ప్రతి వ్యక్తికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గేదెలు శక్తివంతమైనవి అయినప్పటికీ.. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ భయపడుతూనే ఉంటారు.
** జ్యోతిష్యం ప్రకారం గాడిద శ్రమకు సూచికగా భావిస్తారు. కానీ ఇప్పటికీ గాడిదను చిన్నచూపు చూస్తారు. ఒక వ్యక్తి యొక్క రాశిలో గాడిద శని వాహనం అయితే.. అతను లక్ష్యం మరియు విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి. గాడిదను అశుభ వాహనంగా పరిగణిస్తారు.
** శని రాబందు లేదా కుక్కపై స్వారీ చేయడం ఒక వ్యక్తి జాతకంలో శుభప్రదంగా పరిగణించబడదు. దీనివల్ల వ్యక్తి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అదే సమయంలో శారీరక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
** ఆస్ట్రాలజీ ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో శని గుర్రంపై స్వారీ చేయడమనేది శుభప్రదంగా భావిస్తారు. గుర్రం ఉత్సాహం, ధైర్యం మరియు విజయానికి చిహ్నం.
** సింహాన్ని కూడా శని దేవుడి వాహనంగా కూడా పరిగణిస్తారు. సింహం ధైర్యం మరియు వివేకానికి సూచికగా భావిస్తారు. శని సింహంపై స్వారీ చేయడం శుభప్రదం. ఇది శత్రువులపై విజయానికి సూచికగా నమ్ముతారు.
** శనిదేవుడు నక్కపై స్వారీ చేయడం అశుభకరం. ఒక వ్యక్తి జాతకంలో శని నక్కపై సంచరిస్తున్నట్లయితే.. అతడు ఇతరులపై ఆధారపడి జీవిస్తాడని అర్థం.
** శనిదేవుడు కాకిపై స్వారీ చేయడం కూడా అశుభ సంకేతంగా భావిస్తారు. కుటుంబంలో మనస్పర్థలు, వివాదాలు తలెత్తుతాయి. ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
** ఏనుగు శక్తి మరియు అవగాహనకు చిహ్నంగా భావిస్తారు. అయితే శనిదేవుడు ఏనుగుపై స్వారీ చేయడం అశుభం. కుండలిలో ఇది ఉన్నవారు ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి.
** హంసపై శని ప్రయాణించడం శుభప్రదంగా భావిస్తారు. శని ఒక వ్యక్తి జాతకంలో హంసపై స్వారీ చేస్తే.. ఆ వ్యక్తి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది.
Also Read: Five Rajyog: ఒకే రోజు పంచగ్రహ కూటమితోపాటు 5 రాజయోగాలు... నేటి నుంచి ఈ 3 రాశులకు తిరుగులేనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook