Shani Amavasya 2023: ఈ రోజే మౌని అమావాస్య..నది స్నానాలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Mauni Magh Shani Amavasya: హిందూ సాంప్రదాయంలో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నదీ స్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో శని దేవుని పూజించడం వల్ల శని చెడు ప్రభావం కూడా సులభంగా నశిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
Mauni Magh Shani Amavasya: మౌని అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. 20 సంవత్సరాల తర్వాత మౌని అమావాస్య శనివారంలో వచ్చింది. అయితే ఈరోజు మౌనవ్రతాన్ని పాటించి శని దేవునికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రా ఎప్పుడు చెబుతున్నారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి దేవతామూర్తులకు అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఈరోజు నది స్నానాలకు ప్రత్యేకమైనది.. భక్తులంతా పెద్ద ఎత్తున నది స్నానాలను ఆచరించి సూర్య భగవానున్ని పూజిస్తారు.
ఈరోజు ఉదయం 6.27 గంటలకు మౌని అమావాస్య ప్రవేశించింది. రాశి సంచారాలు చేసిన సూర్య భగవానుడు ఇదే రోజు ప్రభావంతంగా ఉంటాడు. శనివారం రోజున మౌని అమావాస్య 20 ఏళ్లకు పూర్వం వచ్చిందని ఈరోజు దానధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు దూరం కావడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శని మహాదశతో బాధపడేవారు ఈరోజు శని దేవునికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి.. ఆవాల నూనెతో అభిషేకం చేస్తే సులభంగా శని చెడు ప్రభావం నశిస్తుంది.
ఈరోజు మౌనరతాలకు ప్రాముఖ్యమైన రోజు కాబట్టి మౌనరాతాలు పాటించే వారికి తీపి ఆహార పదార్థాలను దానం చేసి.. వారి పాదాలకు నమస్కరించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
నది స్నానాల ప్రాముఖ్యత:
మౌని అమావాస్య రోజు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నది స్నానాలు చేసి సూర్యభగవానుడితోపాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లో చెడు దూరమవుతుంది. అంతేకాకుండా శని చెడు ప్రభావంతో బాధపడుతున్న వారు ఈరోజు శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి.
Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook