Shani And Jupiter Transit: శని మరియు బృహస్పతి గ్రహాల గమనంలో పెను మార్పు.. ఇక వీరికి లాభాలే లాభాలు..

Saturn And Guru Transit: ఈ ఏడాది రెండు పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఈ సంచారం వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు.
Shani And Jupiter Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు నిర్ణీత సమయం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల గమనంలోని పెను మార్పు ప్రజలందరి జీవితాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది కొందరికి శుభకరంగా ఉంటే, మరికొందరికి అశుభకరంగా ఉంటుంది. కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చే శనిదేవుడు జనవరి 17న, ఏప్రిల్ ప్రారంభంలో బృహస్పతి తమ రాశులను మార్చనున్నాడు. వీటి సంచారం వల్ల కొన్ని రాశులవారు భారీగా లాభపడనున్నారు.
ధనుస్సు రాశిచక్రం (Sagittarius): గురు మరియు శని దేవుల సంచారం మీకు శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ కోరికలు నెరవేరుతాయి. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. శనిదేవుడు మీకు లగ్జరీ లైప్ ను ఇస్తాడు. పూర్వీకుల ఆస్తి ద్వారా లాభం పొందుతారు. శనిదేవుని సంచారం వల్ల ధనుస్సు రాశి వారు సడే సతి నుండి బయటపడతారు. ఉద్యోగస్తుల కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి.
కర్కాటక రాశిచక్రం (Cancer): బృహస్పతి మరియు శని యొక్క రాశి మార్పు మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేశారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందుతారు. మీకు భారీగా డబ్బు సమకూరుతుంది.
తులా రాశిచక్రం (Libra): శని మరియు బృహస్పతి కలయిక తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ జాతకంలో ఐదవ ఇంట్లో సంచరిస్తాడు. అందుకే ఈ శనిదేవుడు మీకు విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులు కోరిక నెరవేరుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.