Shani Shukra yuti 2023: 30 ఏళ్ల తర్వాత మకరంలో శని-శుక్ర సంయోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం..

Shani Shukra yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, మకరరాశిలో శని మరియు శుక్రుడు కలయిక ఏర్పడుతోంది. దీని వల్ల 4 రాశుల వారు ఆర్థికంగా లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 12:31 PM IST
Shani Shukra yuti 2023: 30 ఏళ్ల తర్వాత మకరంలో శని-శుక్ర సంయోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం..

Saturn And Venus Conjunction 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తాయి. న్యాయాన్ని ఇచ్చే శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలోకి ఉన్నాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కూడా  త్వరలో మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. 30 సంవత్సరాల తర్వాత మకరరాశిలో ఈ రెండు స్నేహ గ్రహాల కలయిక (Saturn And Venus Conjunction 2023) ఏర్పడుతుంది. వీరిద్దరి కలయిక కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): శని మరియు శుక్రుల కలయిక కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో వీరిద్దరి కలయిక ఏర్పడుతుంది. మీరు పార్టనర్ షిప్ తో ఏదైనా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. సంతానం కావాలనుకునే వారు ఈ సమయంలో పిల్లలు కలుగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతికి అపారమైన అవకాశాలున్నాయి. 
మకర రాశిచక్రం (Capricorn): శని మరియు శుక్రుల సంయోగం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి యెుక్క లగ్నస్థ గృహంలో వీరి సంచారం జరుగుతుంది. దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడి పరంగా ఈ సమయం మంచిది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి టైం. 
ధనుస్సు రాశిచక్రం (Sagittarius): శనిదేవుడు మరియు శుక్రుడు కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకానికి సంబంధించిన డబ్బు ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పెద్ద పదవిని పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: Sankranti 2023: సంక్రాంతికి ముందు ఈ 4 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News