Shani Bhagawan Pooja Process : మామూలుగా అందరి దేవుళ్లను పూజించినంతగా శని దేవుడిని మనవాళ్లు పూజించరు. అయితే ఎవరికి అయితే శని దోషాలు ఉన్నాయో వారు మాత్రమే ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తూ ఉంటారు. సాధారణంగా శని దేవుడిని న్యాయ దేవుదిగా భావిస్తూ ఉంటారు, ఆయన చల్లని చూపు ఉండాలని కోరుకుంటారు కానీ  ప్రతికూల దృష్టిని ఎవరూ కోరుకోరు. అందుకే శనిదేవుని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరీ ముఖ్యంగా శనివారం నాడు శని దేవుడిని ఆరాధించడం ద్వారా, ఆయన ఎక్కువగా సంతోషిస్తాడని నమ్ముతారు. అయితే పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మంది ప్రజలకు తెలియదు. అయితే ఇలా కనుక చేయకపోతే శనిదేవుని అనుగ్రహం లభించదు. శనివారం నాడు శని దేవుడికి నువ్వులు, బెల్లం, కిచిడీ సమర్పిస్తే నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆయన త్వరగా సంతోషిస్తారని, అనుగ్రహం కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటుందని చెబుతున్నారు.


అందుకే మీరు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, శనివారం కొన్ని వస్తువులను ఆయనకు సమర్పించాల్సి ఉంటుంది. మామూలుగా దేవుని పూజలో ప్రజలు ఎప్పటికప్పుడు రాగి పాత్రలు ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడి పూజ సమయంలో ఈ పాత్రలు శుభప్రదంగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు, శని దేవుడిని పూజ చేసేటప్పుడు రాగి పాత్రలు అస్సలు ఉపయోగించవద్దు. ఎందుకంటే రాగి సూర్యునికి సంబంధించినది, శని దేవుడికి రాగి పాత్ర శత్రువుగా పరిగణించబడుతుంది.


శని దేవుని పూజించడానికి ఇనుప పాత్రలు మాత్రమే ఉపయోగించండి. ఇక శని దేవుని పూజ చేసేటప్పుడు పడమర దిక్కుకు ఫేస్ చేసి కూర్చోవాలి.  శని దేవుడికి పశ్చిమ దిశకు అధిపతిగా భావిస్తారు, కాబట్టి ఈ దిశలో కూడా పూజలు చేయవచ్చు. అయితే, పూజ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విషయం ఏమిటంటే, శని దేవునికి ముందుగా వచ్చి ఎప్పుడూ పూజించకూడదు. అంటే, మీ ముఖం శని దేవుడి కంట పడకూడదన్న మాట. ఇకపై పూజలు చేసేప్పుడు జాగ్రత్త వహించాలి. 
Also Read: Pearl Gemstone: ముత్యాలను ధరించడం ఎందుకు ప్రాణాంతకమో తెలుసా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..


Also Read: Shani Dev : శనిదేవుడి అనుగ్రహం.. ఇవి చేస్తే ఇక శుభాలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook