Shani Chalisa Vidhi: హిందూ మతంలో శని వారం రోజును శని దేవునికి అంకితం చేశారు. అయితే శని దేవున్ని ప్రతి శనివారం పూజించడం వల్ల మనిషి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా శని దేవునుడికి సూర్యుడి మధ్య సంబంధాలు ఉండడం వల్ల సూర్యుడిని పూజించడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ శని దేవుడి ప్రభావం తొమ్మది రాశులపై పడే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి శని చెడు ప్రభావంతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా శనివారం శని దేవున్ని పూజించడమే కాకుండా శని చాలీసాను సరైన మార్గంలో పఠిస్తే త్వరలోనే అనుగ్రహం లభించి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా శని చెడు ప్రభావంతో బాధపడుతున్నవారు కూడా ఈ చాలీసా పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


శని చాలీసా పఠించే సరైన పద్ధతి:
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మనిషి జీవితంలో ఆనందం, ఇంట్లో శ్రేయస్సు పొందడానికి శని చాలీసాను పద్దతిగా పఠించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శనివారం రోజున ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


- మత గ్రంథాల ప్రకారం.. శనివారం రోజూ ఇంట్లోని పూజా స్థలంలో ఆవనూనె దీపాన్ని వెలిగించి.. శని దేవుడిన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శని చాలీసా పఠించండి. ఇలా ప్రతి శని వారం రోజున శని దేవుడి చాలీసాను పాఠిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా శని దోషం కూడా పోతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  


ఈ చాలీసాను పఠించండి:


॥ దోహా ॥
>>జయ గణేశ గిరిజా సువన మంగల కరణ కృపాల ।
>>దీనన కే దుఖ దూర కరి కీజై నాథ నిహాల ॥


>>జయ జయ శ్రీ శనిదేవ ప్రభు సునహు వినయ మహారాజ ।
>>కరహు కృపా హే రవి తనయ రాఖహు జనకీ లాజ ॥


॥ చౌపాయీ ॥
>>జయతి జయతి శనిదేవ దయాలా ।
>>కరత సదా భక్తన ప్రతిపాలా ॥


>>చారి భుజా తను శ్యామ విరాజై ।
>>మాథే రతన ముకుట ఛబి ఛాజై ॥


>>పరమ విశాల మనోహర భాలా ।
>>టేఢ దృష్టి భృకుటి వికరాలా ॥


>>కుణ్డల శ్రవణ చమాచమ చమకే ।
>>హియే మాల ముక్తన మణి దమకై ॥


>>కర మేం గదా త్రిశూల కుఠారా ।
>>పల బిచ కరైం అరిహిం సంహారా ॥


>>పింగల కృష్ణో ఛాయా నన్దన ।
>>యమ కోణస్థ రౌద్ర దుఖ భంజన ॥


>>సౌరీ మన్ద శనీ దశ నామా ।
>>భాను పుత్ర పూజహిం సబ కామా ॥


Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్


Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook