Shani Dev Ka Mantra: శని దేవుడి పేరు చెప్పగానే చాలా మంది బయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని దేవుడి చెడు ప్రభావం మనుషుల జీవితాల్లో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి శని చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు నివారణాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి శనివారం శని దేవుడికి పూజా కార్యాక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం శని అర్ధ ప్రభావం ధనుస్సు, మకరం, కుంభరాశులపై పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా రకాల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. దీంతో 2023 సంవత్సరంలో మేష, వృషభ, సింహ, కన్యా రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023లో ఈ రాశులవారిపై శని దేవుడి చెడు ప్రభావం ఉండబోతోంది:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేషం, వృషభం, సింహం, కన్యా రాశుల వారికి 2023 సంవత్సరంలో శని దేవుడు చెడు ప్రభావం చూపబోతున్నాడని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


రోజూ హనుమాన్ చాలీసా పఠించండి:
పైన పేర్కొన్న రాశులవారు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాల్సి ఉంటుంది. దీని వల్ల కూడా శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా హనుమాన్‌ దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.


శివలింగానికి నీటితో అభిషేకం చేయండి:
శని వారం రోజున శివలింగానికి నీటితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శని దేవుడి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది.


శని చాలీసా, మంత్రాన్ని జపించండి:
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని చాలీసా, శని దేవుని బీజ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ ఆరాధించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: TSPSC JL Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అప్లికేషన్ ప్రక్రియ వాయిదా


Also Read: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో వైసీపీ-టీడీపీ నేతల పరస్పర దాడి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook