Do Not keep Shani Dev Idols at Home:  పనులను బట్టి ఫలితానిచ్చే దేవుడు శని (Shani Dev). శని దేవుడి మంచిదృష్టి బిచ్చగాడిని కూడా బిలియనీర్ ను చేస్తుంది. శనివక్ర దృష్టి ధనవంతుడ్ని కూడా దరిద్రుడ్ని చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ శనిదేవుడి అనుగ్రహం పొందాలని పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో శనిదేవుడిని పూజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకపోతే తీవ్ర దుష్ర్పభావాలను ఎదుర్కొవల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం శనిగ్రహం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబర్ 22 తర్వాత శని కదలిక ప్రారంభమవుతుంది. అప్పటివరకు  తిరోగమనంలోనే ఉంటాడు. శని యెుక్క కదలిక ప్రజల జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి ఒక్కరూ శనియెుక్క వక్రదృష్టి పడకుండా చూసుకోవాలి. శనిదేవుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. 


ఇవి గుర్తించుకోండి
>>  శని విగ్రహం లేదా బొమ్మను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. నిజానికి శని దృష్టిలో ప్రతికూలత ఉంటుంది. కాబట్టి అతని కళ్లముందు ఎవరు నడవకూడదు. శని దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం సర్వనాశనమవుతుంది. 
>>  శని దేవుడిని పూజించేటప్పుడు అతని ముందు దీపం వెలిగించడం మానుకోవాలి. దీనికి బదులుగా రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే పశ్చిమ దిశలో కూర్చుని శని దేవుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించండి.
>>  ఇంట్లో శని విగ్రహం లేదా బొమ్మను ఉంచకుండా మానసికంగా వాటిని ధ్యానం చేయండి. మనస్ఫూర్తిగా శనిని ప్రార్థించండి. 


Also Read: Shani Dev Remedies: ఈ రోజే రెండో శ్రావణ శనివారం.. శని మహాదశ తొలగిపోవాలంటే ఈ 5 రాశులవారు ఇలా చేయండి!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook